Ravi Teja : మహా శివరాత్రికి మాస్ రాజా మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ రానుందట..!

మాస్ మహారాజా రవితేజ ఇటీవల ఖిలాడి సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నవిషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు ఓ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Ravi Teja : మహా శివరాత్రికి మాస్ రాజా మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ రానుందట..!
Raviteja
Follow us

|

Updated on: Feb 27, 2022 | 7:40 AM

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ఇటీవల ఖిలాడి సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నవిషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు ఓ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. `రామారావు ఆన్ డ్యూటీ` అనే సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP మరియు RT టీమ్ వర్క్స్ పథకం పై  యువ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా `రామారావు ఆన్ డ్యూటీ`సినిమా టీజర్ లాంచ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా ఈ టీజర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ న్యూ యాక్షన్ పోస్టర్ విడుదలచేసింది. ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకునేలా సరికొత్త గెటప్లో కనిపించారు. ఈ పోస్టర్ భారీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా చక్కర్ లు కొడుతోంది.  వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శామ్ సిఎస్ అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా క్రాంక్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. ఇది యదార్థ సంఘటనల నుండి స్పూర్తి పొందిన కథ, సినిమా ప్రచార కంటెంట్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiara Advani And Siddharth: త్వరలో ఏడడుగులు నడవబోతున్న మరో ప్రేమజంట!.. కియారా, సిద్ధార్థల పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్‌!

Bigg Boss Non-Stop Grand Launch Highlights: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్.. మరోసారి అదరగొట్టిన నాగ్

Samyuktha Menon: ఛార్మినార్ వద్ద సందడి చేసిన భీమ్లా నాయక్ హీరోయిన్… వైరల్ అవుతున్న ‘సంయుక్త’ ఫొటోస్..