Ravi Teja Khiladi Review : ఫ‌క్తు ర‌వితేజ జోన‌ర్ చిత్రం `ఖిలాడి`

Ravi Teja Khiladi Review : ఫ‌క్తు ర‌వితేజ జోన‌ర్ చిత్రం `ఖిలాడి`
Khiladi

గ‌తేడాది లాక్‌డౌన్ కాస్త కామ్‌డౌన్ అవుతున్న టైమ్‌లో క్రాక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప‌క్కా హిట్ అందుకున్నారు ర‌వితేజ‌.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajeev Rayala

Feb 11, 2022 | 1:31 PM

Khiladi Review : గ‌తేడాది లాక్‌డౌన్ కాస్త కామ్‌డౌన్ అవుతున్న టైమ్‌లో క్రాక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప‌క్కా హిట్ అందుకున్నారు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ థ‌ర్డ్ వేవ్ టైమ్ దాదాపుగా పూర్త‌యిన‌ట్టే. ఇప్పుడు ఖిలాడిగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. రిలీజ్‌కి ముందే బిజినెస్ ప‌రంగా మంచి బ‌జ్ క్రియేట్ చేసిన ఖిలాడి ఎలా ఉంది? జ‌నాలు ఏమంటున్నారు?

సినిమా: ఖిలాడి

న‌టీన‌టులు: ర‌వితేజ‌, అర్జున్ సార్జా, ఉన్ని ముకుంద‌న్‌, మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి, నికితిన్ ధీర్‌, స‌చిన్ కేడేఖ‌ర్‌, ముఖేష్ రిషి, ఠాకూర్ అనూప్ సింగ్‌, రావు ర‌మేష్‌, ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిశోర్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, భ‌ర‌త్‌రెడ్డి, కేశ‌వ్ దీప‌క్‌, బేబీ శాన్విత త‌దిత‌రులు

ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ వ‌ర్మ‌

నిర్మాత‌లు: స‌త్య‌నారాయ‌ణ కోనేరు, ర‌మేష్ వ‌ర్మ‌

కెమెరా: సుజీత్ వాసుదేవ్‌, జీకే విష్ణు

సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి కుడుముల‌

విడుద‌ల‌: ఫిబ్ర‌వ‌రి 11, 2022

మోహ‌న గాంధీ (ర‌వితేజ‌) అనాథ‌. అత‌న్ని చేర‌దీసిన రాజ‌శేఖ‌ర్ (రావు ర‌మేష్‌) అత‌నికి త‌న కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తారు. కంపెనీలో అన్నీ ప‌క్కాగా ఉండాల‌నుకుంటాడు గాంధీ. కానీ కొన్నిటిని చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయాల‌నుకునే త‌త్వం రాజ‌శేఖ‌ర్‌ది. ఇదే అత‌న్ని ఇబ్బందుల్లో ప‌డేస్తుంది. దీని వ‌ల్ల గాంధీ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ప‌డుతుంది. అసలు ఈ మొత్తం క‌థ‌లో గాంధీని డేవిడ్ (ఠాకూర్ అనూప్ సింగ్) ఎందుకు టార్గెట్ చేశాడు? గురుసింగం(ముఖేష్ రిషి) రాజ‌కీయాల‌కు, బాల‌సింగం(నికితిన్ ధీర్‌) డింపుల్ మీద మ‌న‌సు ప‌డ‌టానికి, బేబీ శాన్విత‌కు ప్రియ‌(మీనాక్షి చౌద‌రి) క‌నెక్ట్ అవ్వ‌డానికి రీజ‌న్ ఏంటి? ఇంత‌కీ సీబీఐ ఆఫీస‌ర్ అర్జున్ భ‌రద్వాజ్(అర్జున్‌) మంచివాడా కాదా? ఇంటిలిజెన్స్ బ్యూరో జ‌య‌రామ్(స‌చిన్ కేడేఖ‌ర్‌) గురించి గాంధీ తెలుసుకున్న నిజాలేంటి? రామ‌కృష్ణ(ఉన్ని ముకుంద‌న్‌) క‌థ‌కు, గాంధీ యాంబిష‌న్‌కి లింకు ఎక్క‌డ కుదిరింది? పుట్ట‌ప‌ర్తి (ముర‌ళీశ‌ర్మ‌), బాబీ (వెన్నెల కిశోర్‌), చంద్ర‌క‌ళ‌(అన‌సూయ‌)కు గాంధీతో ఉన్న ప‌రిచ‌యం ఎలాంటిది? వంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

ర‌వితేజ‌కు మోహ‌న్‌గాంధీ త‌ర‌హా పాత్ర‌లు కొట్టిన పిండే. యాక్ష‌న్‌, ఛేజ్‌లు, డైలాగులు… అన్నీ చాలా ఈజ్‌తో చేసేశారు. రాజ‌శేఖ‌ర్‌గా రావు ర‌మేష్ త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. డింపుల్ హ‌య‌తి, అన‌సూయ కేర‌క్ట‌ర్ల డ‌బుల్ వేరియేష‌న్ ఆడియ‌న్స్ కి ట్రీటే. పుట్ట‌ప‌ర్తి, బాబీ కేర‌క్ట‌ర్లు కూడా ఫ‌న్ పంచుతాయి. అర్జున్ చాన్నాళ్ల త‌ర్వాత మంచి రోల్‌లో క‌నిపించారు. యాక్ష‌న్ కింగ్ అనే పేరుకు త‌గ్గ‌ట్టే ఆయ‌న‌కు కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్ ఉన్నాయి. ఫారిన్‌లో తీసిన ఛేజ్ యంగ్ స్ట‌ర్స్ ని ఆక‌ట్టుకుంటుంది. చాన్నాళ్ల త‌ర్వాత ముఖేష్ రిషి తెలుగు స్క్రీన్ మీద సంద‌డి చేశారు. కంచె విల‌న్ నికితిన్‌కి ఇందులో డీసెంట్ కేర‌క్ట‌ర్ ద‌క్కింది. పాట‌లు లావిష్‌గా ఉన్నాయి. ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌క్కి త‌గ్గ‌లేద‌ని స్క్రీన్ చూసిన వారికి ఇట్టే అర్థ‌మైపోతుంది. ర‌వితేజ ఎన‌ర్జీకి త‌గ్గట్టే ఉన్నాయి ట్యూన్లు. హీరోయిన్ల ఎక్స్ పోజింగ్‌లు, బికినీ సీన్లు, ఛేజ్‌లు, కార్లు వంటివ‌న్నీ ప‌క్కా యాక్ష‌న్ డ్రామా సినిమాకు కావాల్సిన‌ట్టుగా సింక్ అయ్యాయి.

ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం కోసం హీరోయిన్ ఫ్యామిలీ… పండించ‌డం, వ‌డ్డించ‌డం అనే కాన్సెప్ట్ ఫాలో అయ్యే తీరు వినోదం పంచుతుంది. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు క‌థ చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ఆ త‌ర్వాత తీసుకున్న ట్విస్టులు అంద‌రికీ క‌న్విన్సింగ్‌గా అనిపించ‌క‌పోవ‌చ్చు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూడాల‌నుకునేవారికి ఖిలాడి న‌చ్చుతుంది.

చివరకు : ఖిలాడి ఫ‌క్తు ర‌వితేజ మార్కు సినిమా.

మరిన్ని ఇక్కడ చదవండి :

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu