Khiladi​ Movie : ‘ఫుల్ కిక్కు’ ఇవ్వడానికి రెడీ అవుతున్న మాస్ రాజా.. ఖిలాడి నుంచి మాస్ మసాలా సాంగ్ రానుంది..

క్రాక్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ట్రాక్ .లోకి వచ్చిన మాస్ రాజా అదే స్పీడ్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. క్రాక్ సినిమా తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Khiladi​ Movie : 'ఫుల్ కిక్కు' ఇవ్వడానికి రెడీ అవుతున్న మాస్ రాజా.. ఖిలాడి నుంచి మాస్ మసాలా సాంగ్ రానుంది..
Raviteja Khiladi Movie
Follow us

|

Updated on: Jan 24, 2022 | 7:36 PM

Khiladi​ Movie : క్రాక్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ట్రాక్ .లోకి వచ్చిన మాస్ రాజా అదే స్పీడ్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. క్రాక్ సినిమా తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పాటలు, అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ నటిస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా.. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. చివరకుసినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు.

ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఖిలాడి సినిమానుంచి ,మరో మాస్ మాసాల సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దాంతో ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేయనున్నారు. క్రాక్ ఇచ్చిన సక్సెస్ ను ఖిలాడితో కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ నెల 26న రానున్న ‘ఫుల్ కిక్కు’ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్తున్నారు చిత్రయూనిట్. ఉదయం 10:08 నిమిషాలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సాగర్ ఆలపించాడు. చూస్తుంటే రవితేజ ఎనర్జీకి తగినట్టుగా ఈ పాట మంచి జోరుగా సాగనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ .. మురళీశర్మ .. అనసూయ  ముఖ్యమైన పాత్రల్లో ఆకట్టుకోనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 

Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!

Vishnu Priya: సమంత పాటకు విష్ణుప్రియ రిహర్సల్ అదుర్స్.. ఊ అంటావ మావ అంటూ రచ్చ..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..