Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకు సరికొత్త టైటిల్.. అదిరిపోయిందిగా

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మిస్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇతిహాసంను పరిహాసం చేశారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటించి అలరించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీత పాత్రలో నటించింది.

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకు సరికొత్త టైటిల్.. అదిరిపోయిందిగా
Prabhas
Follow us

|

Updated on: Jun 26, 2023 | 9:34 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు రోజు రోజుకు కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మిస్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇతిహాసంను పరిహాసం చేశారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటించి అలరించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీత పాత్రలో నటించింది. అలాగే ఈ సినిమాలో రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. రామాయణ కథను చెప్పే క్రమంలో దర్శకుడు ఓం రౌత్ పలు వివాదాలను నెత్తినేసుకున్నారు. చాలా మంది ఇది రామాయణం కాదు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫ్యాన్ సలార్  సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ మూవీ. ఇందులో శృతిహాసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని టాక్.

అలాగే ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రాజా డీలక్స్ అనే టైటిల్ తో తెరకెక్కుతోందని మొన్నటివరకు టాక్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి మరో టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ సినిమాకు రాయల్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. రాయల్ అనే టైటిల్ ప్రభాస్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.