Manchu Vishnu : మంచు విష్ణులో కనిపించని పశ్చాత్తాపం.. దాడి ఘటన పై మీడియాకు ఉచిత సలహా..

|

Dec 11, 2024 | 1:15 PM

మంచు కుటుంబంలో వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఆరోపణలు చేశారు. ఇప్పటికే మీడియాపై దాడి ఘటనపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాపై దాడి ఘటనను ఇంకా సెన్సేషన్ చేయెద్దని.. క్షణికావేశంలో జరిగిన దాడి అని అన్నారు.

Manchu Vishnu : మంచు విష్ణులో కనిపించని పశ్చాత్తాపం.. దాడి ఘటన పై మీడియాకు ఉచిత సలహా..
Manchu Vishnu
Follow us on

మోహన్ బాబు హెల్త్ అప్డేట్ విడుదల చేసిన తర్వాత మంచు విష్ణు తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ క్రమంలోనే మీడియాపై దాడి ఘటనను ఇంకా సెన్సేషన్ చెయ్యొద్దని క్షణికావేశంలో మాత్రమే ఆ ఘటన జరిగిందని అన్నారు. మీడియాతో విష్ణు మాట్లాడుతూ.. “మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసిమెలసి ఉంటామని అనుకున్నాను.. కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. మేము మళ్లీ తిరిగి కలుస్తామని ఆశిస్తున్నాను. మా నాన్న చేసిన తప్పు మమ్మల్ని అతిగా విపరీతంగా ప్రేమించడం.  ప్రతీ కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి.  కాబట్టి, ఈ విషయాన్ని సెన్సేషన్ చేయ్యొద్దు. ప్రజలలో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. మీడియాపై దాడి అనేది కేవలం క్షణికావేశంలో జరిగింది. మా నాన్న ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదు. ఈ జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా కోసం పోస్ట్ ప్రొడక్షన్ కోసం లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు ఇంట్లో జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాను. నిన్న ఉదయాన్నే వచ్చాను. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. వినయ్ నాకు ఒక అన్న లాంటి వాడు. పోలీసులు మాకు నోటీసులు ముందు ఇవ్వక ముందు ప్రెస్ కు రిలీజ్ చేస్తున్నారు. కమిషనర్ ముందు హాజరవుతాను. నిన్న జరిగిన గొడవలో ఓ రిపోర్టర్ కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. ఆయన ముందు నమస్కారం పెడుతూ ముందుకు వచ్చారు. కానీ ఆ హీట్ మూమెంట్ లో అలా జరిగింది. ఉద్దేశపూర్వకంగా మేము చేయలేదు ” అని అంటూ తన తండ్రి తప్పేం లేదన్నట్లుగా మాట్లాడారు.

మంచు విష్ణు మాటలపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. నిన్న మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిపై మీడియాకు క్షమాపణ చెప్పకుండానే వెళ్లిపోయారు. దీంతో విష్ణు తీరుపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోహన్‌బాబు ఉన్మాదంతోనే దాడి చేశారని.. మైక్‌ తీసుకుని కసితీరా దాడి చేయడం చిన్న ఘటనా..? కవరేజ్‌కి వెళ్లిన మీడియాపై దాడి చేసి సమర్థించుకుంటారా..? అంటూ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. మంచు మోహన్‌బాబు, విష్ణు తీరుపై సర్వత్రా  విమర్శలు వస్తున్నాయి. మీడియా ప్రతినిధులపై దాడిని సెన్సేషన్ చెయ్యొద్దని విష్ణు ఉచిత సలహా ఇవ్వడంపై సీరియస్ అవుతున్నారు జర్నలిస్టులు.  ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణం స్పందించి యాక్షన్ తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.