Manchu Vishnu: మోనార్క్ వెర్సెస్ మంచు… విష్ణు విజ్ఞప్తిని ప్రకాష్ రాజ్ మన్నిన్చేనా..?

మా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆ వేడి మాత్రం తగ్గడం లేదు.. ఇప్పటికి  ఒకరి పై ఒకరు నిందలు వేస్తూనే ఉన్నారు.

Manchu Vishnu: మోనార్క్ వెర్సెస్ మంచు... విష్ణు విజ్ఞప్తిని ప్రకాష్ రాజ్ మన్నిన్చేనా..?
Maa

Manchu Vishnu : మా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆ వేడి మాత్రం తగ్గడం లేదు.. ఇప్పటికి  ఒకరి పై ఒకరు నిందలు వేసుకుంటూనే ఉన్నారు. మా ఎన్నికల్లో ఎప్పుడైతే తాను పోటీ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ప్రకటించారో.. అప్పుడే వేడి రాజుకుంది. ప్రకాష్ రాజ్‌కు పోటీగా మంచు విష్ణు రంగంలోకి దిగారు. ప్రకాష్ రాజ్ ఒకడుగు ముందుకు వేసి తన ప్యానెల్‌ను కూడా ప్రకటించారు. ఆతర్వాత మంచు విష్ణు మా భవంతి ప్రస్తవాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. మా కు బిల్డింగ్ కావాలని అందు కోసం తన సొంత డబ్బులతో మా బిల్డింగ్ కడతానని .. రెండు మూడు ప్లేస్‌లు కూడా చూశానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక అక్కడి నుంచి అసలు రచ్చ మొదలైంది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. లోకల్ నాన్ లోకల్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా ఐదుగురు మా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు బరిలో దిగారు.. కానీ ఆ తర్వాత ఒకొక్కరిగా విరమించుకుంటూ వచ్చారు. చివరకు ప్రకాష్ రాజ్- మంచు విష్ణు పోటీలో మిగిలారు. అక్కడి నుంచి అసలు రాజకీయం మొదలైంది. ఇద్దరు జోరుగా ప్రచారం మొదలు పెట్టారు. మంచు విష్ణు వరుసగా కృష్ణ , కృష్ణం రాజు, కోట శ్రీనివాస్ రావు, బాలకృష్ణ ఇలా సినిమా పెద్దలందరిని కలిసి వారి మద్దతు కోరాడు. అటు ప్రకాష్ రాజ్ మాత్రం తనకు పెద్దల సపోర్ట్ అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత వ్యక్తిగత విషయాల వరకు కూడా వెళ్లారు ఇద్దరు. చివరకు ఈ పోరులో మంచు విష్ణు విజయం సాధించారు.

దాంతో ఎన్నికల్లో ఓటమి పాలైన నటుడు ప్రకాష్ రాజ్.. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని.. అతిథిగా వచ్చాను కాబట్టి అతిథిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ మేరకు మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు వాట్సాప్ ద్వారా తన రాజీనామాను తెలిపారు. ‘డియర్ విష్ణు.. ‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన విజయానికి అభినందనలు. ‘మా’ ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి. నాన్ మెంబర్ గా మీకు అన్ని విధాలా సాయం చేస్తాను.. థ్యాంక్యూ” అని మంచు విష్ణు కు ప్రకాష్ రాజ్ వాట్సాప్ మెసేజ్ చేశారు. దానికి విష్ణు స్పందిస్తూ..

”డియర్ అంకుల్.. థాంక్యూ.. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమనే విషయం మీకు తెలుసు. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దని కోరుతున్నాను. మా కుటుంబలో మీరు కూడా భాగమే. నాకు మీ ఐడియాలు అవసరం. మనం కలిసి పనిచేయాలి. మీరు ఇప్పుడు నాకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. ఐ లవ్ యు అంకుల్. ప్లీజ్ తొందరపడకండి” అని మంచు విష్ణు పేర్కొన్నారు.

Vishnu

Vishnu

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్‌..

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu