టాలీవుడ్ లో అందాల తారగా వెలిగిన హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు అనుష్క. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంది ఈ భామ. ఈ క్రమంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఆమె రేంజ్ ను పెంచుకుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించింది ఈ భామ. ఇక అరుంధతి సినిమాతో అనుష్క క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత బాహుబలి సినిమా ఈ అమ్మడిని పాన్ ఇండియా హీరోయిన్ గా మార్చింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఇక ఈ చిన్నది చివరిగా నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
ఇక ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేస్తోంది అనుష్క. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. అనుష్క కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . సినిమా తారలా పేరు చెప్పి కొంతమంది జాదూగాళ్ళు డబ్బులు వసూల్ చేయడం మనం చూశాం.. తాజాగా అనుష్క విషయంలోనూ అలాంటిదే జరిగింది.
తాజాగా అనుష్క పేరుతో పెద్ద మోసం జరిగింది. హీరోయిన్ అనుష్క, సంగీత దర్శకుడు మణిశర్మ ల అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి ‘విశ్వకర్మ క్రియేషన్స్’ అధినేత, నిర్మాత లక్ష్మణ్ చారిని ఎల్లారెడ్డి అనే వ్యక్తి మోసం చేశాడు. అతని దగ్గర నుంచి ఏకంగా 51లక్షలు వసూల్ చేశాడు. అయితే 51 లక్షలు ఇచ్చినా కూడా అనుష్క, మణిశర్మ అపాయింట్మెంట్ లు దక్కకపోవడంతో లక్షణ్ చారి మోసపోయానని తెలుసుకొని ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది.