Mohanlal: “మోహన్‌లాల్ పిరికివాడు ” హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

|

Aug 30, 2024 | 8:47 PM

లైంగిక వేధింపుల సమస్య గురించి ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా మొత్తం మాట్లాడుకుంటుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను ఎత్తిచూపుతూ జస్టిస్ హేమ ప్యానెల్ నివేదిక విడుదలైంది.

Mohanlal: మోహన్‌లాల్ పిరికివాడు  హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Malayalam Actress Parvathy
Follow us on

మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక కలకలం రేపుతోంది. మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య గురించి ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా మొత్తం మాట్లాడుకుంటుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను ఎత్తిచూపుతూ జస్టిస్ హేమ ప్యానెల్ నివేదిక విడుదలైంది. దీంతో చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. మలయాళ చిత్రసీమలో పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులపై లైంగిక ఫిర్యాదులు రావడం మొదలైంది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ

ఈ నివేదిక భారతదేశమంతటా హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో మలయాళ సినీ కళాకారుల సంఘం ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్‌ రాజీనామా చేశారు. అలాగే కార్యనిర్వాహక కమిటీ సభ్యులందరూ అమ్మకు రాజీనామా చేశారు. హేమ కమిటీ విచారణ నివేదిక అందర్నీ విస్మయానికి గురిచేస్తే, మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేయడం కూడా షాకిచ్చింది.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

అమ్మ సంస్థ నిర్వాహకుల ఈ చర్యపై నటి పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసింది. నిరంతర లైంగిక ఫిర్యాదుల నేపథ్యంలో మలయాళ నటీనటుల సంఘం అమ్మ నుంచి మోహన్‌లాల్‌తో సహా ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేయడం పిరికిపంద చర్య అని నటి పార్వతి విమర్శించారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ వార్త వినగానే నేను షాక్ అయ్యాను.ఇది ఎంత పిరికితనం.. అంటే. ఈ విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న వాళ్లు పిరికితనంతో బాధ్యత నుంచి ఎలా తప్పుకుంటారు.? అని ప్రశ్నించింది పార్వతి. అలాగే ఆమె మాట్లాడుతూ.. మలయాళ నటీనటుల సంఘం (అమ్మ)లోని వ్యక్తులు ఎలా పని చేస్తారో నాకు బాగా తెలుసు. అక్కడ మా అవసరాల గురించి మాట్లాడే హక్కు నాలాంటి నటీమణులకు లేదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలంటే మెరుగైన నాయకత్వం అవసరం. రాబోయే కాలంలోనైనా ప్రతి ఒక్కరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.