Mahesh Babu: ‘మా సినిమా మాములుగా ఉండదు’.. త్రివిక్రమ్ సినిమా గురించి మహేష్ ఆసక్తికర కామెంట్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు త్రివిక్రమ్ పెట్టింది పేరు.

Mahesh Babu: 'మా సినిమా మాములుగా ఉండదు'.. త్రివిక్రమ్ సినిమా గురించి మహేష్ ఆసక్తికర కామెంట్స్
Mahesh
Follow us

|

Updated on: Aug 10, 2022 | 7:50 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు త్రివిక్రమ్ పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటే ఖచ్చితంగా హిట్ అనే టాక్ ఉంటుంది. అయితే త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటటైనర్లు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు డిఫరెంట్ జోనర్లు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అలా వచ్చిన సినిమానే ఖలేజా.. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో యమా క్రేజ్ ఉంది. ఇప్పటికి ఈ సినిమా వస్తే టీవీలకు అతుకుపోతుంటారు. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ జోనర్లో సినిమా చేయనున్నారు గురూజీ. త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు పుష్కరకాలం తర్వాత మహేష్- గురూజీ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు మహేష్. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమం కూడా జరిగిపోయింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు మహేష్. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మహేష్. త్రివిక్రమ్ డైరెక్షన్.. డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా కాలం తరువాత మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయింది.ఆయనతో పని చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ కథను రెడీ చేశాడు. డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా రానుంది. ఇప్పటివరకు నేనుగాని .. త్రివిక్రమ్ గాని ఇలాంటి సినిమా చేయలేదు. మా సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకుతగ్గట్టుగా ఉంటుంది” అని మహేష్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!