Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ఆ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయట..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ఆ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయట..
Rajeev Rayala

|

Apr 28, 2021 | 6:39 AM

sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్లార్కారు వారి పాట షూటింగ్ కు కూడా ప్యాకప్ చెప్పారు చిత్రయూనిట్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగం లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తుంది. హీరో తండ్రి ఒక బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఉంటాడట. ఒక బిజినెస్ మెన్ ఆ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలను తీసుకుని ఎగ్గొడతాడు. దాంతో రంగంలోకి దిగిన హీరో, ఆ బిజినెస్ మెన్ తో ఎలా ఆ డబ్బు కంట్టించాడనేదే కథ అంటూ ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ఇక సినిమాలో మహేష్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ లో మహేష్ మీద పైన రూపాయి టాటూ తో కనిపించారు. ఇక  ఈ సినిమా షూటింగ్ మొన్నటివరకు దుబాయ్ , గోవాలో జరిగింది. ఇటీవలే చిత్రయూనిట్ హైదరాబాద్ లో చ్ఛిత్రీకరణ మొదలు పెట్టింది. ఇంతలో కరోనా రీ ఎంట్రీ ఇవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఇక దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ మహేష్ అభిమానులను ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. మరో వైపు సర్కారు వారి పాట సినిమాలో కామెడీ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సప్తగిరి .. ప్రియదర్శి .. అనసూయ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Oscars 2021: క‌నిపించ‌ని భారతీయ సినిమా ఉనికి.. గ్లోబల్ రేంజ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ను స్మరించుకున్న‌ ఆస్కార్ వేదిక

బాడీ షేమింగ్ గురించి ఓపెన్ అయిన ‘బర్ఫీ’ బ్యూటీ..! తన పన్నేండేళ్ల వయసు నుంచే అనుభవిస్తోందట..!

పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu