MAA Elections: ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఆ ముగ్గురు.. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఎవరికి ?

తెలుగు సినిమా నటీనటుల సంఘం 'మా' అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడకముందే సినీ పరిశ్రమలో ఎన్నికల

MAA Elections: 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ఆ ముగ్గురు.. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఎవరికి ?
Maa Elections


తెలుగు సినిమా నటీనటుల సంఘం ‘మా’ అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడకముందే సినీ పరిశ్రమలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. నిన్న మొన్నటివరకు మంచు విష్ణు… ప్రకాష్ మధ్య పోటీ ఉందనుకుంటే.. తాజాగా జీవిత రాజశేఖర్ కూడా మా పోరుకు సిద్ధం అయ్యారు. ప్రస్తుతం “మా” కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్ ఈ సారి మళ్లీ అధ్యక్షపీఠం కోసం కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో నరేశ్‌ ప్యానెల్‌ నుంచి జీవిత, హీరో రాజశేఖర్ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి గెలిచారు. కాని అలా గెలిచిన కొన్ని నెలలకే నరేశ్‌తో విభేదించారు. వైస్ ప్రెసిడెంట్ అయిన రాజశేఖర్.. ఏకంగా మీడియా ముందే నరేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగేలా చేయడానికి సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు వంటి వారు కల్పించుకోవాల్సి వచ్చింది. కానీ చివరకు రాజశేఖర్ పదవికి రాజీనామా చేయగా.. జీవిత కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు. ఇదిలా ఉంటే… ప్ర‌కాశ్ రాజ్‌, విష్ణు ఈ సారి మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పిన తరువాత, అనూహ్యంగా జీవిత రాజశేఖర్ బరిలోకి దిగుతున్నానని ప్రకటించడం అందర్నీ షాక్‌ చేసింది. జీవిత ఉన్నట్టుండి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం ఏమై ఉంటుందా అని అందర్నీ ఆలోచించేలా చేసింది.

మూడు నెలల ముందు నుంచే మా ఎన్నికల హడావిడి ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రకాశ్‌ రాజ్‌ అనూహ్య అడుగుతోనే ఈ పోరుకు అడుగు పడింది. అప్పట్లోనే మా అధ్యక్షపదవికి పోటీ చేయాలనుకున్న ప్రకాష్ రాజ్.. అందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్. అందుకు వకీల్ సాబ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలను ఫౌండేషన్ గా వాడుకున్నట్లు కూడా టాక్‌. అంతకు ముందు పవన్ తో తనకు వున్న సైద్దాంతిక విబేధాలను, పవన్ పై తను చేసిన కామెంట్లను కూడా ఆ ఇంటర్వ్యూలతో ప్లాన్‌ ప్రకారం చెరిపేసే ప్రయత్నం.. అదే సమయంలో చిరుతో సఖ్యత. ఇలా ప్రకాష్ రాజ్ మా ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూనే వచ్చారు.

ఇక మంచు విష్ణు పోటీలో నిలబడటానికి సీనియర్ యాక్టర్ నరేష్ పావులు కదిపినట్లుగా ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే ఎన్నికలను ఫేస్ చేసిన అనుభవం నరేష్‌ కు వుండడంతో, ఆ వ్యూహాలన్నీ విష్ణు కోసం నరేష్ వాడుతున్నారని… అందులో భాగంగానే సీనియర్లు కృష్ణ, కృష్ణంరాజులను విష్ణు రీసెంట్‌గా కలిశారని ఫిల్మ్‌ నగర్‌ న్యూస్‌. ఇక గతంలో నరేష్ కు మద్దతుగా ముందుకు వచ్చిన మెగా సోదరుడు నాగబాబు ఇప్పుడు ప్రకాష్ రాజ్ వైపు వున్నారు. కళాకారులకు ప్రాంతీయ, భాష, స్థానిక బేధాలు వుండవని నచ్చ చెప్పే ప్రయత్నం ప్రారంభించారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అన్నది పక్కన పెడితే ప్రకాష్ రాజ్ కు నటీనటుల్లో అంత సానుకూలత వున్నట్లు మాత్రం కనిపించడం లేదు. ప్రకాశ్ రాజ్ సెట్ లో రిజర్వ్డ్ గా ఉంటారని.. అలాగే వివాదాస్పద వ్యక్తి అని టాక్ నడుస్తోంది. ప్రకాష్ రాజ్ కాకుండా మెగా క్యాంప్ మద్దతు వేరెవరికైనా ఉంటే వ్యవహారం వేరుగా వుండేదని.. అలాగే విష్ణుకు నరేష్ మద్దతు లేకున్నా వేరుగా వుండేదని విశ్లేకుల అంచనా వేస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ కు మెగా మద్దతని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరు ముందు ముందు ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఇక మెగా మద్దతు ఎవరికుంటే.. వారినే ‘మా’ అధ్యక్ష పదవి వరిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి మద్దతు లభించిందంటే.. పోటీలో ఉన్న వ్యక్తి దాదాపు ‘మా’ అధ్యక్ష పీఠంపై కూర్చున్నట్లే. అయితే ఈసారి జరగబోయే పోటీలో మెగా మద్దతు ఎవరికి ఉంటుందనేదే.. ఇప్పుడందరిలో ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. ఓవైపు సెప్టెంబర్‌లో ‘మా’ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మరో వైపు ముగ్గురు అభ్యర్థులు ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితలు ఇప్పటికే అధ్యక్ష బరిలో ఉన్నామని ప్రకటించి.. వ్యూహ ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డారు.  ‘మా’ ఎన్నికల్లో ఆ ముగ్గురు స్పెషల్ స్టోరీని టీవీ9లో ఈరోజు (జూన్ 23న) మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించండి.

లైవ్ వీడియో..

Also Read: Priyanka Chopra: ‘బాలీవుడ్‌లో వారిదే ఆధిపత్యం’.. బీటౌన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన గ్లోబల్ స్టార్..