Maa Elections 2021: ‘మా’ భవనం కట్టే బాధ్యత నాది.. మీడియాతో మంచు విష్ణు..

మా ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రకాశ్ రాజ్ నిలబడుతున్నానని ప్రకటించారో అప్పటి నుంచే.. 'మా పోరు' ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తూ.. రసవత్తరంగా సాగుతోంది.

Maa Elections 2021:  'మా' భవనం కట్టే బాధ్యత నాది.. మీడియాతో మంచు విష్ణు..
Vishnu
Follow us

|

Updated on: Oct 07, 2021 | 4:31 PM

Maa Elections 2021: మా ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రకాశ్ రాజ్ నిలబడుతున్నానని ప్రకటించారో అప్పటి నుంచే.. ‘మా పోరు’ ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తూ.. రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు.. ప్రత్యర్థులు.. ప్లాన్లు, పార్టీలు.. ఆడియో రికార్డుల లీకులు.. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో ఫైటింగ్‌లు ఇలా.. రకరకాలుగా సాగుతూ..రాజకీయాలనే తలదన్నుతోంది. ఎలక్షన్ డేట్ అక్టోబర్ 10 దగ్గరకు రావడంతో.. అభ్యర్థులు ఈ తరహా ప్రచారాలకే ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తూ… ‘మా’ మెంబర్స్‌ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం గణపతి కాంప్లెక్స్‌ ఏరియాలో చిన్న కళాకారులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు ప్రకాశ్‌రాజ్‌. అలాగే మంచు విష్ణు సినిమా పెద్దలను కలుస్తూ వస్తున్నారు. తాజాగా మంచు విష్ణు తన మ్యానిఫెస్టో విడుదల చేశారు.  మా ఎలక్షన్స్‌…టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. మేనిఫెస్టోలు-హామీలు..ఒకటేమిటీ..? జనరల్‌ ఎలక్షన్స్‌ మించి సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంచు విష్ణు ప్యానెల్‌ విజయం మేనిఫెస్టోను ప్రకటించింది. తమ ప్యానెల్‌ విజయం సాధిస్తే రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడిన అర్హులైన ఆర్టిస్ట్‌లకు సొంత ఇల్లు వచ్చేలా చేస్తామన్నారు. దాంతోపాటు సొంత ఖర్చులతో మా కొత్త బిల్డింగ్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

మాలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్‌’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్‌ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తామన్నారు. జాబ్‌ కమిటీ ద్వారా వారందరికీ సినిమాలు, OTT వంటి మాధ్యమాల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. అర్హులైన మా సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం నిర్మిస్తామన్నారు మంచు విష్ణు. దాంతోపాటు మా’లో ఉన్న ప్రతి మెంబర్‌,వారికుటుంబ సభ్యులకు ఫ్రీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు , పిల్లలకు కేజీ టు పీజీ వరకు విద్యాసాయం అందిస్తామన్నారు.

  మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతున్నారు..