Lavanya Tripathi: ‘చేసిన పాత్రలన్నీ కేక్ వాక్‌లానే చేశాను’.. లావణ్య త్రిపాఠి ఆసక్తికర కామెంట్స్

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. కుర్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇప్పుడు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Lavanya Tripathi: 'చేసిన పాత్రలన్నీ కేక్ వాక్‌లానే చేశాను'.. లావణ్య త్రిపాఠి ఆసక్తికర కామెంట్స్
Lavanya Tripathi
Follow us

|

Updated on: Jul 05, 2022 | 7:59 PM

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi). కుర్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇప్పుడు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య ప్రధాన పాత్రలో మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హ్యాపీ బర్త్ డే’. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ను రూపొందించారు. ఈ సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడారు.

అందాల లావణ్య మాట్లాడుతూ.. మొదటి సారి గన్ పట్టుకోవడం కొత్తగా అనిపించింది. జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను సహజంగానే జిమ్, బాక్సింగ్ చేస్తాను. కానీ మొదటిసారి స్క్రీన్ పై యాక్షన్ చూపించే అవకాశం ‘హ్యాపీ బర్త్ డే’తో దక్కింది అని చెప్పుకొచ్చింది.అలాగే ‘హ్యాపీ బర్త్ డే’ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇందులో హ్యాపీ అనే పాత్ర చేశాను. ‘హ్యాపీ’ బర్త్ డే కథలో కీలకంగా వుంటుంది. కథ ఐడియా చాలా నచ్చింది. చాలా కొత్త జోనర్. సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎక్సయిట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేయడం ఇంకా ఆనందం. నన్ను చాలా మంది సీరియస్ పర్శన్ అనుకుంటారు. నేను చేసిన పాత్రలు కూడా అలా వుండటం వలన ఆ అభిప్రాయం వచ్చివుండోచ్చు. కానీ నేను చాలా జోవియల్ గా వుంటాను. సరదాగా అందరితో జోక్స్ వేయడం నాకు ఇష్టం. ‘హ్యాపీ’ పాత్ర చేయడం చాలా ఈజీగానే అనిపించింది. పాత్రలో చాలా ఫన్ వుంది. ఇందులో ఫోర్స్ కామెడీ వుండదు. హ్యాపీ బర్త్ డే అందరినీ నవ్విస్తుంది.

ఫీమేల్ ఓరియెంటెడ్ అనగానే చాలా సీరియస్ గా వుండే పాత్రలే వస్తుంటాయి. కానీ ఇలాంటి ఎంటర్ టైనర్ లో లీడ్ రోల్ రావడం ఆనందం. రితేష్ రానా నన్ను ఒక ఇంటర్వ్యూ లో చూసి హ్యాపీ పాత్రని రాశారు. ఈ విషయంలో చాలా లక్కీగా ఫీలౌతున్నా. మొదటి సినిమా అందాల రాక్షసిలో మిథున పాత్ర చేసినప్పుడు నటన నాకు కొత్త. ఈ సినిమా లో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. తర్వాత చేసిన పాత్రలన్నీ కేక్ వాక్ లానే చేశాను. ఐతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ‘హ్యాపీ’ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇందులో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. హ్యాపీ పాత్ర మీ అందరికీ నచ్చుతుంది. హ్యాపీ పాత్ర చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మేకప్ మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. అలాగే గన్స్ ని క్యారీ చేయడం కూడా కొంచెం కష్టం అనిపించింది. ఒకొక్క గన్ 9 కేజీలు వరకూ వుంటుంది. దాన్ని మోస్తూ షూట్ చేయడం అంత సులువు కాదు అని చెప్పుకొచ్చింది లావణ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?