Kollywood: వై దిస్ కొలవెరి… పక్క చూపులు చూస్తున్న కోలీవుడ్ స్టార్ హీరోలు..

గతంలో వెయ్యిక్యాండిళ్ల వెలుగు వెలిగిన తమిళ్ సినిమా ఇప్పుడు చిమ్మచీకట్లో మగ్గుతోంది. అందరూ వరసబెట్టి పాన్ ఇండియా సౌండ్ ఇస్తుంటే.. మేం మాత్రం..

Kollywood: వై దిస్ కొలవెరి... పక్క చూపులు చూస్తున్న కోలీవుడ్ స్టార్ హీరోలు..
Kollywood
Follow us

|

Updated on: Apr 20, 2022 | 9:38 AM

Kollywood: గతంలో వెయ్యిక్యాండిళ్ల వెలుగు వెలిగిన తమిళ్ సినిమా ఇప్పుడు చిమ్మచీకట్లో మగ్గుతోంది. అందరూ వరసబెట్టి పాన్ ఇండియా సౌండ్ ఇస్తుంటే.. మేం మాత్రం.. మాతో మేమే పోటీ పడుతూ టైమ్‌పాస్ చేస్తున్నాం.. అంటూ లోపల్లోపలే కుమిలిపోతున్నారు. ఇంతకీ… వై దిస్ కొలవెరి.. మలబారు సీమ నుంచి వచ్చే మలయాళీ సినిమాలు క్వాలిటీ పరంగానైనా మిగతా పరిశ్రమలతో పోటీపడుతున్నాయ్. మొన్నటివరకూ కార్నర్‌లోనే ఉండిపోయి అనాధ అనిపించుకున్న కన్నడ ఇండస్ట్రీని సెల్యులాయిడ్ ప్రపంచం మీద సత్తా చాటేలా చేసింది కేజీఎఫ్ చాప్టర్2. తెలుగు సినిమా అయితే పాన్ ఇండియా అనే పదానికి కొత్తగా డెఫినిషిన్ రాసుకుని దూసుకుపోతోంది. ఈ సందట్లో కోలీవుడ్ అడ్రస్సే గల్లంతవుతోందా? మనమెక్కడున్నాం అని నెత్తీనోరూ బాదేసుకుంటోందిప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ. ఒకప్పుడు చక్రం తిప్పిన శంకర్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్‌ లాంటి లెజెండరీలు ఇప్పుడు బ్యాక్‌బెంచెస్‌కే పరిమితమయ్యారు. తమిళ హీరోయిజం కూడా బాగా నీరసపడింది. సొంత ప్రయత్నాలు బెడిసికొట్టడంతో టాలీవుడ్‌ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల కోసం పక్కకి చూస్తున్నారు. బీస్ట్ సినిమా బోల్తాపడ్డాక… చెన్నై సర్కిల్స్‌లో అంతర్మధనం ఓ రేంజ్‌లో మొదలైంది. అంతంతమాత్రంగా ఆడిన వలిమై రికార్డులతోనే పోల్చుకుంటూ సంతృప్తి పడుతున్నారు బీస్ట్ మేకర్స్.

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ బిగ్‌ స్టార్లుగా ఆలిండియా క్రేజ్‌ తెచ్చుకున్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుని… గతమెంతో ఘనకీర్తి అనుకుంటున్నారు తమిళ్ సినిమా ట్రెడిషనల్ లవర్స్‌. అరుణ్‌పాండ్యన్ లాంటి హీరోలైతే.. ఈ సిట్యువేషన్‌కి స్టార్‌ హీరోలు తీసుకునే భారీ రెమ్యునరేషన్లే కారణం అంటూ కౌంటర్లు మొదలుపెట్టారు. కేజీఎఫ్2 ఎంత బాగా ఆడుతున్నా, పక్కూరు సినిమా కావడంతో దానికి ధియేటర్లివ్వకుండా బీస్ట్ కోసం బ్లాక్‌ చేస్తున్నారంటే అక్కడ ఎంత జెలస్ ఫీలింగ్ వచ్చిందో కదా! ఒకప్పటి ప్రైడ్ ఆఫ్ కోలీవుడ్ మణిరత్నం… తనకు ఇన్‌స్పిరేషన్ రాజమౌళేనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చి.. ఇన్‌డైరెక్ట్‌గా కోలీవుడ్ స్థాయిని తగ్గించేశారు. క్రేజీ డైరెక్టర్ అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్‌తో సినిమా చేస్తున్నారు. తెలుగు హీరో రామ్‌చరణ్‌తో బిజీగా వున్నారు శంకర్. తమిళ్‌ హీరోలు ధనుష్, విజయ్‌, శివకార్తికేయన్‌ అందరూ పక్కచూపులే చూస్తున్నారు. మరి.. మన ప్రతిష్ట నిలబెట్టే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు చెన్నై క్రిటిక్స్ అడుగుతున్న ప్రశ్న.

మరిన్ని ఇక్కడ చదవండి :

Acharya: భలే భలే బంజారా రెస్పాన్స్ అదుర్స్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న తండ్రికొడుకులు..

RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..