సినిమా ఇండస్ట్రీని వీడని విషాదాలు.. ఒకే రోజు కన్నుమూసిన సీనియర్‌ డైరెక్టర్‌, యంగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌

టాలీవుడ్‌కు చెందిన యువనటుడు సుధీర్‌ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని మర్చిపోకముందే మరో ఇద్దరు సినీ ప్రముఖులు కన్నుమూశారు. ఒకే రోజున డైరెక్టర్, యంగ్‌ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందారు.

సినిమా ఇండస్ట్రీని వీడని విషాదాలు.. ఒకే రోజు కన్నుమూసిన సీనియర్‌ డైరెక్టర్‌, యంగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌
Ramdoss, Ramakrishnan
Follow us

|

Updated on: Jan 26, 2023 | 8:28 AM

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పేరు మోసిన నటులు ఒక్కొక్కరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్‌కు చెందిన యువనటుడు సుధీర్‌ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని మర్చిపోకముందే మరో ఇద్దరు సినీ ప్రముఖులు కన్నుమూశారు. ఒకే రోజున డైరెక్టర్, యంగ్‌ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందారు.  కోలీవుడ్ కు చెందిన ప్రముఖ సీనియర్‌ దర్శకుడు, నటుడు ఈ.రామదాస్‌(66) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను చూలైమేడులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స కొనసాగుతుండానే కన్నుమూశారాయన. దర్శకుడి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామదాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విల్లుపురంకు చెందిన రామదాసు సినిమా రంగంపై ఆసక్తితో చెన్నై వచ్చారు. మొదట రచయితగా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. అధేవిధంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు.

కాగా ఎంతో భవిష్యత్‌ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణన్ (25) కూడా హఠాత్తుగా కన్నుమూశడు. తూత్తుకుడి జిల్లా, కోవిల్ పట్టికి చెందిన శ్రీనివాసన్ కుమారుడు అయిన రామకృష్ణన్.. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వం వహిస్తున్న థగ్స్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాలిగ్రామంలో ఓ స్టూడియోలో జరుగుతున్నాయి. అయితే స్టూడియోలో ఉన్నట్లుండి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు రామకృష్ణన్. వెంటనే చిత్రబృందం అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే రామకృష్ణన్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇలా కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖులు మృతిచెందడంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు వీరి మృతికి నివాళులు అర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..