Prabhas: స్పిరిట్‌ మూవీ కథ ఇదేనా? డార్లింగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా..!

| Edited By: Janardhan Veluru

Dec 14, 2024 | 12:11 PM

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ మూవీ స్పిరిట్ (Spirit) ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఒక్క అప్‌డేట్ మాత్రమే వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తున్నాయి.

Prabhas: స్పిరిట్‌ మూవీ కథ ఇదేనా? డార్లింగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా..!
Prabhas Spirit Movie Update
Follow us on

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాను ఒక్కో డిఫరెంట్ జానర్‌ లో ట్రై చేస్తున్న డార్లింగ్, నెమ్మదిగా ఇంటర్నేషనల్‌ ఆడియన్స్‌ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ది రాజాసాబ్‌, ఫౌజీ సినిమాల షూట్‌ లో పాల్గొంటున్న ప్రభాస్‌.. ఆ తరువాత అర్జున్‌ రెడ్డి, యానిమల్ సినిమాల దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. స్పిరిట్‌ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు స్పిరిట్ సినిమాకు సంబంధించి ఒకే ఒక్క అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు సందీప్‌. ఈ సినిమాలో ప్రభాస్‌ రూత్‌ లెస్‌ కాప్‌ గా కనిపించబోతున్నారని చెప్పారు. అంతేకాదు ఫస్ట్ టైమ్ డార్లింగ్‌ యూనిఫామ్‌ లో కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌ తో డార్లింగ్ ఫ్యాన్స్‌ లో అంచనాలు పీక్స్‌ కు చేరాయి. ఆ తరువాత అంచనాలు డబుల్ చేసే అప్‌ డేట్స్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ సినిమాలో కొరియన్ స్టార్ హీరో మా డాంగ్ సియోక్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌ లో వైరల్ అవుతోంది. అంతేకాదు సియోక్ వర్సెస్ ప్రభాస్ సీన్స్‌ ను సందీప్‌ నెక్ట్స్ లెవల్‌లో డిజైన్ చేస్తున్నారట. ఈ న్యూస్‌ తో డార్లింగ్ అభిమానులు ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌ కు చేరాయి. ఇంటర్నేషనల్ యాక్షన్‌ హీరోతో డార్లింగ్‌ యాక్షన్ బ్లాక్స్‌ చూసేందుకు డైహార్డ్ ఫ్యాన్స్ ఈగర్‌ గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ కాంబోకు సంబంధించి మరో న్యూస్‌ ట్రెండింగ్‌ లోకి వచ్చింది. ఈ మూవీలో సియోక్ ఇంటర్నేషన్‌ మాఫియా డాన్‌ గా కనిపిస్తారని, ప్రభాస్‌ అతన్ని ఎదిరించే ఇండియన్ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించబోతున్నారన్నది నయా అప్‌ డేట్‌. అంటే స్పిరిట్ కథ కూడా గ్లోబల్‌ రేంజ్‌ లోనే ఉండబోతున్నది నయా ట్రెండ్ న్యూస్‌. ఈ అప్‌డేట్ తరువాత ఫ్యాన్స్‌ లో జోష్ మరింత పెరిగింది.

ఆల్రెడీ పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ఎమర్జ్‌ అయిన డార్లింగ్, కల్కి 2898 ఏడీతోనే గ్లోబల్ ఆడియన్స్‌ కు దగ్గరయ్యారు. ఇప్పుడు స్పిరిట్‌ తో పూర్తి స్థాయి గ్లోబల్ ప్రాజెక్ట్‌ ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే త్వరలో డార్లింగ్ హాలీవుడ్ రేంజ్‌ కు చేరటం పక్కా అని గట్టిగా ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌.