Keerthy Suresh: గుడ్‌ లక్‌ సఖి వచ్చేది ఆరోజే.. అప్డేట్‌ షేర్‌ చేసిన కీర్తి..

ఓవైపు హీరోయిన్‌గా గ్లామరస్‌ పాత్రలు చేస్తూనే.. మరోవైపు మహిళా ప్రాధాన్య చిత్రాలతో అలరిస్తోంది కీర్తి సురేశ్‌. 'పెంగ్విన్‌' 'మిస్‌ ఇండియా' సినిమాల తర్వాత..

Keerthy Suresh: గుడ్‌ లక్‌ సఖి వచ్చేది ఆరోజే.. అప్డేట్‌ షేర్‌ చేసిన కీర్తి..
Follow us

|

Updated on: Nov 02, 2021 | 10:27 AM

ఓవైపు హీరోయిన్‌గా గ్లామరస్‌ పాత్రలు చేస్తూనే.. మరోవైపు మహిళా ప్రాధాన్య చిత్రాలతో అలరిస్తోంది కీర్తి సురేశ్‌. ‘పెంగ్విన్‌’ ‘మిస్‌ ఇండియా’ సినిమాల తర్వాత ఆమె నటిస్తోన్న మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్ లక్‌ సఖి’. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి రైఫిల్‌ షూటర్‌గా కనిపించనుంది. ఆమె కోచ్‌గా జగపతిబాబు కనిపించనున్నారు. నగేశ్‌కుమార్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యి చాలాకాలమైంది. అయితే కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేక పోయింది. అయితే ఎట్టకేలకు ఈ నెల 26న ‘గుడ్‌ లక్‌ సఖి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో ఆది పినిశెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, గ్లింప్స్‌ సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. ఈ మేరకు కీర్తి కూడా తన సినిమా అప్డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను’ అని రాసుకొచ్చింది. ఇక ఈ ఏడాది మార్చిలో ‘రంగ్‌ దే’ తో మెప్పించిన కీర్తి దీపావళికి రజనీకాంత్ ‘పెద్దన్న’ తో కలిసి మన ముందుకు రానుంది.

Also Read:

Samantha: జోరు మీదున్న సమంత.. మరో తెలుగు సినిమాలో ఛాన్స్‌.? ఆ హీరోతో ముచ్చటగా మూడో సారి..

Nikhil: దేనికి ఇంపార్టెన్స్‌ ఇవ్వాలో అర్థం కావట్లేదు.. హీరో నిఖిల్‌ ఆవేదన..! వీడియో

అద్భుతమైన టాలెంట్‌.. ఎవరికీ సాధ్యం కానిది ఇతనికెలా..! వీడియో