Mahesh Babu: మహేష్ కోసం రంగంలో ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ మూవీలో కన్నడ సీనియర్ నటుడు ?..

ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ ప్రతినాయకుడిగా నందమూరి హీరో తారకరత్న నటించనున్నట్లుగా వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

Mahesh Babu: మహేష్ కోసం రంగంలో ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ మూవీలో కన్నడ సీనియర్ నటుడు ?..
Mahesh Babu
Follow us

|

Updated on: Jun 02, 2022 | 12:59 PM

సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాడు సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu). డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు అందుకుని ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఈనెలలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు గతంలో మహేష్ అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ ప్రతినాయకుడిగా నందమూరి హీరో తారకరత్న నటించనున్నట్లుగా వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లేటేస్ట్ టాక్ ప్రకారం.. ఈ సినిమాలో కన్నడ సీనియర్ స్టార్ హీరో రవిచంద్రన్ కీలకపాత్రలో నటించనున్నాడట. ఇప్పటికే రవిచంద్రన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. కన్నడలో రవిచంద్రన్ క్రేజీ స్టార్ హీరో. ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. చాలా కాలం తర్వాత ఇప్పుడు మహేష్.. త్రివిక్రమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సీనియర్ స్టార్. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Mahesh

Mahesh