“సుశాంత్ విష‌యంలో రియా కేవ‌లం పావు మాత్ర‌మే”

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసులో అత‌డి గ‌ర్ల‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి సంచ‌ల‌న ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.

సుశాంత్ విష‌యంలో రియా కేవ‌లం పావు మాత్ర‌మే
Ram Naramaneni

|

Aug 30, 2020 | 5:46 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసులో అత‌డి గ‌ర్ల‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి సంచ‌ల‌న ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శ‌నివారం ఆమెను 7 గంట‌ల‌కు పైగా విచారించారు సీబీఐ అధికారులు. ఈ క్ర‌మంలో కంగ‌నా రనౌత్ కీల‌క కామెంట్స్ చేశారు. సుశాంత్ విష‌యంలో రియా కేవలం ఒక పావు మాత్ర‌మే అని, ఆమె ద్వారా అస‌లు సూత్ర‌ధారి పట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు.

మొదటి నుండి సుశాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న కంగ‌నా, ఇటీవలి ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి, బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణం గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో కొకైన్ బాగా ఉప‌యోగించే డ్ర‌గ్ అని పేర్కొంది. సుశాంత్ మ‌ర‌ణానికి డిప్రెష‌న్ అస‌లు కార‌ణం కాదనే అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచింది. ఈ కేసుకు సంబంధించి కంగనా తన అభిప్రాయాలను వినిపించకుండా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా సుశాంత్ మ‌ర‌ణం గురించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బాలీవుడ్‌లో నెపోటిజం గురించి గ‌ళ‌మెత్తారు.

Also Read :

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu