Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ప్రచారంలో ఆమె.. ఎలిమినేషన్ ఈమె

బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్ లు జరుగుతున్నాయి. 19మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 మొదటి నుంచి ఆసక్తికరంగా సాగుతోంది.

Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ప్రచారంలో ఆమె.. ఎలిమినేషన్ ఈమె
Bigg Boss
Follow us

|

Updated on: Dec 05, 2021 | 6:10 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్ లు జరుగుతున్నాయి. 19మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 మొదటి నుంచి ఆసక్తికరంగా సాగుతోంది. టాప్ 5 కంటెస్టెంట్స్  లో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఎలిమినేట్ అవుతారు అనుకునేవాళ్లు కాకుండా మిగిలిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇటీవల రవి బయటకు రావడంతో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా రవిని ఎలిమినేట్ అంటూ ప్రకటించి బయటకు పంపారు. దాంతో ఆయన ఫ్యాన్స్ రాద్ధాంతం చేశారు. ఇక ఇప్పటివరకు ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదాన్ని లీక్ చేస్తున్నారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి హౌస్ నుంచి బయటకు ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుందని లీక్ చేశారు. దాంతో ప్రియాంక అవుట్ అని అందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రియాంక కాకుండా మరో హౌస్ మేట్ ను ఎలిమినేట్ చేసి ట్విస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

గతంలో కూడా ఇలా ప్రేక్షకులు ఎలిమినేట్ అవుతారనుకున్నవారిని కాకుండా వేరే వారిని బయటకు పంపిన చరిత్ర బిగ్ బాస్ కు ఉంది. ఇప్పుడు ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నా నేపథ్యంలో ఆమె కాకుండా కాజల్ ను ఎలిమినేట్ అవ్వనుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ఇద్దరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని తెలుస్తుంది. ఇక టాప్ 5 లోకి ఇప్పటికే శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: ‘అఖండ’పై అన్షుల్ సక్సేనా ప్రశంసలు.. ‘జై బాలయ్య’ అని కామెంట్..

Pushpa Movie: పుష్ప మేకింగ్‌ వీడియోను చూశారా.? బన్నీ ఇచ్చిన మెసేజ్‌ మాత్రం అదుర్స్‌..

Akira Nandan: తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..