Devara: విడుదలకు ముందే ‘దేవర’ సరికొత్త రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ ఎప్పుడంటే..

|

Sep 24, 2024 | 9:39 AM

ఇదివరకే ఏపీ ప్రభుత్వం కూడా దేవర టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు అర్దరాత్రి 12 గంటల షోతోపాటు ఆరు ఆటలకు అనుమతి ఇచ్చింది. 28 తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతోపాటు అప్పర్ క్లాస్ రూ.110, లోయర్ క్లాస్ రూ.60 , మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రూ.135 వరకు పెంచుకునేందుకు అవకాశం అందించింది.

Devara: విడుదలకు ముందే దేవర సరికొత్త రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ ఎప్పుడంటే..
Devara
Follow us on

డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన చిత్రం దేవర. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్లతో ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో ఈ మూవీ ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ లో హవా కొనసాగిస్తుంది. ఇదివరకే ఓవర్సీస్ లో ప్రీసేల్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకుని రికార్డును క్రియేట్ చేసింది ఈ మూవీ. తాజాగా రెండు మిలియన్ డాలర్ల్ మార్క్ చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ దేవర సినిమా గురించి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదలకు మూడు రోజులు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఓవర్సీస్ లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ సునామీలా దుసుకెళ్తున్నాయి. నార్త్ అమెరికాలో దేవర ప్రీమియర్స్ 2 మిలియన్ డాలర్స్ మార్క్ దాటింది.

ట్రిపుల్ ఆర్ తర్వాత 2M ప్రీమియర్ గ్రాసర్, డే 1 ప్రీ సేల్స్ కలిపి 2.5M మార్క్ దాటేసాడు దేవర. విడుదలకు మూడు రోజులు ముందుగానే దేవర ఈ రేంజ్ బుకింగ్స్ తో సెన్సెషన్ క్రియేట్ చేశాడు. నార్త్ అమెరికాలో బ్యాక్ టూ బ్యాక్ 2M కలెక్షన్స్ రాబట్టిన హీరోగా ఎన్టీఆర్ మరొక రికార్డ్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేవర టికెట్స్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే స్పెషల్ షోస్ కోసం అనుమతి వచ్చింది. తెలంగాణలో 29 థియేటర్లలో సినిమా విడుదల మొదటి రోజు అర్ధరాత్రి 1 గంట స్పెషల్ షో, దాంతోపాటు అన్ని థియేటర్లలో 6 షోస్ (4 గంటల నుంచి ప్రారంభం) ప్రదర్శించేందుకు వెలుసుబాటు కల్పించింది. ఆ స్పెషల్ షోలకు టికెట్ ధర రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్ లో రూ.50 పెంచుకునేందుకు అవకాశాలు కల్పించింది.

అలాగే ఇదివరకే ఏపీ ప్రభుత్వం కూడా దేవర టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు అర్దరాత్రి 12 గంటల షోతోపాటు ఆరు ఆటలకు అనుమతి ఇచ్చింది. 28 తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతోపాటు అప్పర్ క్లాస్ రూ.110, లోయర్ క్లాస్ రూ.60 , మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రూ.135 వరకు పెంచుకునేందుకు అవకాశం అందించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.