Krishna Vamsi: ఎమోషన్ రాబట్టేందుకు ఆ హీరోతో మందు తాగించిన డైరెక్టర్ కృష్ణవంశీ.. ఏ మూవీకి అంటే

డైరెక్టర్ కృష్ణవంశీ క్రియేట్ చేసిన పాత్రలు వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. ఎంతో నేచురల్‌గా ఆయన పాత్రలు డిజైన్ చేస్తారు. అందుకు తగ్గట్లుగా ఆర్టిస్టుల నుంచి నటనను రాబట్టుకుంటారు.

Krishna Vamsi: ఎమోషన్ రాబట్టేందుకు ఆ హీరోతో మందు తాగించిన డైరెక్టర్ కృష్ణవంశీ.. ఏ మూవీకి అంటే
Krishna Vamsi
Follow us

|

Updated on: Feb 06, 2023 | 5:44 PM

ఒక నటుడు తన నటనా పరిధిని పెంచుకునేందుకు, పాత్రలో లీనం అయ్యేందుకు.. ఒక 2 పెగ్స్ మందు తాగడం కరెక్టా, కాదా…?. ఇది చాలా విసృతమైన పరిధి ఉన్న అంశం. అయితే అందులో తప్పు ఏముందని ప్రశ్నించారు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ. అది ఆర్టిస్ట్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. తన అంత:పురం సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ బాగా వచ్చేందుకు.. అతను సీన్స్ చేసేటప్పుడు తానే టకీలా షాట్స్ ఇచ్చినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. టకీలా తాగాకే.. షాట్ పెట్టేవాడినని వెల్లడించారు. అతనికి కంట్రోల్ చేసుకునే స్థాయి ఉంది..  ఈ మందు తాగడం వల్ల అతనిలోని కొన్ని మాస్కులు ఎగిరిపోయి.. సీన్స్ అద్భుతంగా వచ్చాయని వివరించారు. ఇప్పుడు కూడా ఆ పాత్ర గురించి జనాలు మాట్లాడుకుంటారని గుర్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు పంచుకున్నారు కృష్ణ వంశీ.

ఈ విషయాన్ని ధృవీకరించారు జగపతిబాబు. కొన్ని సినిమాలు, కొన్ని సిట్యువేషన్స్‌లో ఇలాంటివి వర్కవుట్ అవుతాయని ఆయన తెలిపారు. అది తప్పని లేదా ఒప్పని తాను జడ్జిమెంట్ ఇవ్వలేనని తెలిపారు. అంత:పురం సినిమాలో క్యారెక్టర్‌ మరింత వైల్డ్‌గా ఉండేందుకు అలా చేశామని తెలిపారు. షూటింగ్ సమయంలో తాగి తప్పుగా బిహేవ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదన్నారు.

సో..  వెండితెరపై కళాకండాలు క్రియేట్ చేసే కృష్ణవంశీ.. తన అనుకున్న ఫెర్ఫామెన్స్ రాబట్టుకునేందుకు ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యేవారన్నమాట. అలాగని వారు దాన్ని అందిరికీ ఇన్‌సిస్ట్ చేయడం లేదు.. కేవలం తమకు అలా వర్కువుట్ అయిందని చెబుతున్నారు. ఎంతైనా మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దానికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.

Anthapuram Movie

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.