Akkineni Akhil: అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనేనా..?

అక్కినేని అఖిల్ సాలిడ్ హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మంచి విజయాన్ని ఆసన్నపటికి అది అక్కినేని అభిమానులకు సరిపోలేదు.

Akkineni Akhil: అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనేనా..?
Akhil
Follow us

|

Updated on: Jul 11, 2022 | 8:55 AM

అక్కినేని అఖిల్(Akkineni Akhil)సాలిడ్ హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మంచి విజయాన్ని ఆసన్నపటికి అది అక్కినేని అభిమానులకు సరిపోలేదు. తమ అభిమాన హీరో నుంచి ఓ భారీ హిట్ ను ఆశిస్తున్నారు ఫ్యాన్స్. దాంతో ఈ సారి ఎలాగైన గట్టి హిట్టు కొట్టాలని కసిమీదున్నాడు అఖిల్. ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. కండలు తిరిగిన బాడీతో సూపర్ సాలిడ్ గా కనిపిస్తున్నాడు. అఖిల్‌ ఏజెంట్‌ లుక్‌ చూస్తే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

తాజాగా అఖిల్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ తన నెక్స్ట్ సినిమా  చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆయన ఇటీవల ఒక పవర్ఫుల్ కథను వినిపించడం, కథ నచ్చడంతో అఖిల్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి హిట్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి