Allu Arjun: AA.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. దూసుకెళ్తున్న ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌..

AA.. అల్లు అర్జున్. ఇదిప్పుడు పేరు కాదు... ఒక బ్రాండ్. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇదీ ఎప్పటికీ ఉండే క్లారిటీ. డ్రైవర్ పుష్పరాజ్ గెటప్‌లో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఈ బ్రాండ్‌ బిల్డింగ్ మీదే మెయిన్‌గా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఈ బ్రాండింగ్ వెనకుండే అసలు కథేంటి..

Allu Arjun: AA.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. దూసుకెళ్తున్న ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌..
Allu Arjun

AA.. అల్లు అర్జున్. ఇదిప్పుడు పేరు కాదు.. ఒక బ్రాండ్. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇదీ ఎప్పటికీ ఉండే క్లారిటీ. డ్రైవర్ పుష్పరాజ్ గెటప్‌లో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఈ బ్రాండ్‌ బిల్డింగ్ మీదే మెయిన్‌గా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఈ బ్రాండింగ్ వెనకుండే అసలు కథేంటంటే..

అల్లు వారి కాంపౌండ్‌లో రీసెంట్‌గా నందమూరి హీరో చేసిన హల్‌చల్ చూశాం. ఆహా కోసం బాలయ్యతో అన్‌స్టాపబుల్ అనే టాక్‌షో ప్లాన్ చేసి… అల్లు అండ్ నందమూరి వారి బంధాన్ని గట్టిపరిచారు అల్లు అరవింద్. అదే సందర్భంలో గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై బాలయ్యతో ఒక బిగ్ మూవీ తీస్తున్నట్టు ప్రకటించి.. నందమూరి ఫ్యాన్స్‌ని ఇంకాస్త మురిపించారు. కట్‌ చేస్తే.. ఈ శనివారం నందమూరి ఇలాఖాలో అల్లు వారి సందడి ఓ రేంజ్‌లో కనిపించింది.

అఖండ ప్రిరిలీజ్ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు ఐకాన్ స్టార్. నందమూరి నటకిశోరం పక్కన నిలబడి తగ్గేదేలే అని తన నయా మేనరిజాన్ని ప్రజంట్ చేశారు పుష్పరాజ్. రీసెంట్‌గా జరిగిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈవెంట్‌లో కూడా ఇలాగే సౌండిచ్చారు ఐకాన్ స్టార్. ఇప్పుడే కాదు చాన్నాళ్లనుంచీ ఇలాగే ఆఫ్‌స్క్రీన్‌లో కొత్తకొత్త కాంబోస్‌ని క్రియేట్ చేస్తూ… టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు బన్నీ. మిగతా హీరోలు కూడా ఇటువంటి అప్పియరెన్స్ ఇస్తున్నా.. బన్నీకి మాత్రమే అనూహ్యమైన హైప్ వస్తోంది. రీసెంట్‌ డేస్‌లో సైలెంట్‌గా మొలకెత్తిన అల్లు బ్రాండింగ్… పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఇలా బలంగా నాటుకుపోతోంది.

అలవైకుంఠపురంలో మూవీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ అయ్యాక అల్లు అర్జున్ దూకుడు మరో లెవల్లో వుందన్నది క్లియర్. స్టయిలిష్ స్టార్ నుంచి ఐకాన్‌స్టార్‌గా ట్రాన్స్‌ఫామ్ కావడమే కాకుండా అందరినీ కలుపుకుపోతూ… పరిశ్రమలో ఒక సూపర్‌ పవర్‌గా ఎమర్జ్ అవుతున్నారు బన్నీ. ప్రతి ప్రీరిలీజ్‌ ఈవెంట్లో.. అల్లు ఆర్మీ, ఐకాన్‌ స్టార్‌ లాంటి స్లోగన్లు రిపీటవుతూనే ఉన్నాయి.

‘అల్లు అరవింద్ సమర్పించు’ అనే సౌండ్ రిసెంట్‌ టైమ్స్‌లో రిపీటెడ్‌గా వినిపిస్తోంది. గీతాఆర్ట్స్‌తో పాటు బన్నీవాసు లీడ్ చేస్తున్న గీతాఆర్ట్స్‌2 కూడా బ్యాక్‌టుబ్యాక్ సూపర్‌హిట్స్‌తో దూసుకుపోతోంది. అటు… ఆహా యాప్‌తో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది అల్లు ఫ్యామిలీ. అల్లు స్టూడియోస్ నిర్మాణం కూడా అల్లు కాంపౌండ్‌ ఇండివిడ్యువల్ పవర్‌ని రిప్రజెంట్ చేస్తోంది.

గజనీ రీమేక్ తర్వాత పద్నాలుగేళ్ల గ్యాప్ ఇచ్చి బీటౌన్‌లో కూడా అల్లుకుపోతున్నారు అరవిందుడు. త్వరలో అల్లు అర్జున్ డైరెక్ట్ హిందీ మూవీ లాంచ్ అదరహో రేంజ్‌లో వుండబోతోందని ఓపెన్‌గా చెప్పేశారు. దశాబ్దాల చరిత్ర వున్న గీతా ఆర్ట్స్‌… ఇప్పుడు భారీ సినిమాలకు కేరాఫ్‌గా మారి నార్త్‌లో కూడా ర్యాపిడ్‌గా దూసుకుపోతోంది. మెగాకాంపౌండ్‌లోనే ఉద్దేశపూర్వకంగా మరో పవర్‌సెంటర్‌ని క్రియేట్ చేస్తున్నారా లేక.. అల్లు అరవింద్ బుద్ధిబలం-ఐకాన్ స్టార్ సెల్ఫ్ స్టామినా రెండూ కలిసి.. AA బ్రాండ్‌ ఇంత వేగంగా ఎదుగుతోందా… అనేది ఇప్పటికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

-Srihari, ET, TV9 Telugu

Read Also.. Balakrishna: అన్‌స్టాపబుల్ తర్వాత బాలయ్య మరో డేర్ స్టెప్.. అదేటంటే..

Published On - 9:06 am, Sun, 28 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu