Pushpa Collections: అక్కడైనా.. ఇక్కడైనా..ఎక్కడైనా తగ్గేదేలే! ప్రపంచవ్యాప్తంగా మూడో వారంలోనూ పుష్ప వసూళ్ళ సునామీ!!

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను కొనసాగిస్తోంది. సౌత్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమా వారం రోజుల్లోనే దాదాపు 165 కోట్లు రాబట్టింది.

Pushpa Collections: అక్కడైనా.. ఇక్కడైనా..ఎక్కడైనా తగ్గేదేలే! ప్రపంచవ్యాప్తంగా మూడో వారంలోనూ పుష్ప వసూళ్ళ సునామీ!!
Pushpa Movie 3rd Week Collections
Follow us

|

Updated on: Jan 02, 2022 | 12:14 PM

Pushpa Collections: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను కొనసాగిస్తోంది. సౌత్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమా వారం రోజుల్లోనే దాదాపు 165 కోట్లు రాబట్టింది. ఐకాన్ స్టార్ సినిమా ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. పుష్పరాజ్ ఇప్పుడు హిందీ మాట్లాడే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ఇక భారత్‌లో భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

2021లో భారతదేశపు అతిపెద్ద చిత్రంగా పుష్ప నిలిచిందని పుష్ప అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. దక్షిణాదిలో దాని ఆదాయ గణాంకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో హిందీ మాట్లాడే ప్రేక్షకుల్లో పుష్ప క్రేజ్ మూడో వారాంతంలో కూడా తగ్గలేదు. పుష్ప ఇప్పుడు రణవీర్ సింగ్ ’83’ ని మెల్లగా బీట్ చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది.

హిందీలోపుష్పరాజ్ సంపాదన 50 కోట్లు దాటింది

పుష్ప హిందీలో రెండు వారాల్లో దాదాపు 47 కోట్ల బిజినెస్ చేయగా, మూడవ వారాంతంలో మొదటి రోజు 3.50 కోట్ల రూపాయలు వసూలు చేసి, రాబోయే వారంలో తన వసూళ్లు మరింతగా ఉండబోతున్నాయని తెలిపింది. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకు 50.59 కోట్ల రూపాయలను రాబట్టింది. హిందీలో ఈ కలెక్షన్స్ చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే, ఇది తక్కువ స్క్రీన్‌లో విడుదలైందిఅలగే, ఇప్పుడు కరోనా నిషేధం కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి పుష్పరాజ్ ను వసూళ్ళ రాజ్ గా మార్చేసింది. ప్రస్తుతానికి ఈ ఏడాది మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ సినిమాగా పుష్ప నిలిచింది.

కలెక్షన్స్ లో స్థిరమైన పెరుగుదల..

అల్లు అర్జున్ చిత్రం ‘పుష్ప’ 17 డిసెంబర్ 2021న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ఇప్పటికీ విపరీతమైన బజ్ ఉంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే హిందీలో రూ.3.5 కోట్ల బిజినెస్ చేసింది. హిందీలో 6 రోజుల్లో దాదాపు 23.23 కోట్ల బిజినెస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధిస్తోంది.

ఇవి కూడా చదవండి: Corona Vaccination: 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. మొదటి రోజు ఎంతమంది నమోదు చేసుకున్నారో తెలుసా?

New Year Horoscope: కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్య..ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఉందా? మరెందుకాలస్యం..