Akkineni Akhil: ఏజెంట్ ప్రమోషన్స్ మాములుగా లేవుగా.. అక్కడ అఖిల్ అక్కినేని భారీ కటౌట్..

అఖిల్ మేకోవర్ అద్భుతంగా వుంది. అఖిల్ స్టైలిష్ అండ్ డైనమిక్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా టీజర్‌ కు

Akkineni Akhil: ఏజెంట్ ప్రమోషన్స్ మాములుగా లేవుగా.. అక్కడ అఖిల్ అక్కినేని భారీ కటౌట్..
Akhil Akkineni
Follow us

|

Updated on: Nov 12, 2022 | 11:20 AM

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని.. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఇందులో అఖిల్ గూఢచారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్‏లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం అఖిల్ మేకోవర్ అద్భుతంగా వుంది. అఖిల్ స్టైలిష్ అండ్ డైనమిక్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత భారీగా పెరిగాయి. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ గతంలోనే ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ 2023 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా సంక్రాంతి రేసు తప్పుకున్నట్లు ఇటీవల ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

అయితే పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ మూవీ ప్రమోషన్లను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను నిర్మిస్తున్న అనీల్ సుంకర ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేశారట. ఓవైపు అఖిల్ అక్కినేని పోస్టర్స్ సోషల్ మీడియాలో విడుదల చేయడంతోపాటు.. భారీ కటౌట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా సూర్యాపేట హైవేలోని రాజు గారి తోట దగ్గర 40 అడుగుల అఖిల్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. పక్కా మాస్ లుక్‏లో సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న అఖిల్ టెరిఫిక్ గా ఉంది. ఇక అఖిల్ కటౌట్ చూసి ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇందులో అఖిల్ స్పై గా కనిపించబోతున్నారు. అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి
Akhil

Akhil

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.