Vishwak Sen: ‘ఆ అమ్మాయి నన్ను వదిలేసింది’.. బ్రేకప్ స్టోరీ చెప్పిన విశ్వక్ సేన్

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నగరనికి ఏమైంది, ఫలక్ నామాదాస్ సినిమాలతో హిట్ అందుకున్నాడు విశ్వక్ సేన్.

Vishwak Sen: 'ఆ అమ్మాయి నన్ను వదిలేసింది'.. బ్రేకప్ స్టోరీ చెప్పిన విశ్వక్ సేన్
Vishvak Sen
Follow us

|

Updated on: Apr 30, 2022 | 10:24 AM

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నగరనికి ఏమైంది, ఫలక్ నామాదాస్ సినిమాలతో హిట్ అందుకున్నాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత నాని నిర్మించిన హిట్ లాంటి మిస్టరీ థ్రిల్లర్ సాలిడ్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్.. ఆశించిన స్థాయిలో హిట్ అనుకోలేకపోయాడు. దాంతో ఇప్పుడు విష్వక్ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అశోక వనంలో అర్జున కళ్యాణం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఏజ్ బార్ అవుతున్నా పెళ్లికాని యువకుడి పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ మూవీని మే 6న విడుదల చేస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలో విశ్వక్ సేన్ ఇన్ స్టా వేదికగా వున్న సెలబ్రిటీలతో ముచ్చటించారు. విశ్వక్ సేన్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్క మగాడి లైఫ్ లోని ఏదో ఒక సందర్భంలో ఇలాంటి కథలు వుంటాయి. ప్రతి ఒక్కరూ ఈ ట్రాజెడీకి గురవుతారు. అదే విషయాన్ని మేము సినిమాల్లో చూపిస్తున్నాం. అన్నారు. రియల్ లైఫ్ విషయానికి వస్తే నాకొక బ్రేకప్ స్టోరీ వుంది. నేను దాదాపు మూడేళ్ల పాటు ఓ అమ్మాయిని ప్రేమించాను. ఏమైందో తెలియదు తాను నన్ను వదిలేసి వెళ్లిపోయింది. అయితే ఆమె నన్ను వదిలేసిందన్న విషయం నాకు నెలరోజుల తరువాత తెలిసింది. దాని గురించి తలుచుకుంటే ఇప్పటికీ బాధగానే వుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..