Vishal 32 : ప్రీ లుక్‌తో అదరగొట్టిన విశాల్.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న మూవీ..

హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్

Vishal 32 : ప్రీ లుక్‌తో అదరగొట్టిన విశాల్.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న మూవీ..
Vishal
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 14, 2021 | 6:32 AM

Vishal : హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ ఇటీవలే మరో సినిమాను పట్టాలెక్కించి విషయం తెలిసిందే. ‘ఎనిమీ’ ‘సామాన్యుడు షూటింగ్లను పూర్తి చేసిన విశాల్. ఇప్పుడు ఎ. వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌నున్నారు. ఇటీవల  విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఇక ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. రానా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ర‌మ‌ణ‌, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విశాల్‌కు జోడీగా సునైన‌ నటిస్తోంది. ఈ సినిమాకోసం మేక‌ర్స్ ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది.

ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండ‌నుందని తెలుస్తుంది. ఈ క్రమంలో టైటిల్ లుక్ ప్రీ లాంచ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. విశాల్ ఇప్ప‌టికే ఎన్నో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో న‌టించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండ‌నుంది. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ త‌ప్ప‌కుండా ప్రేక్షకులను అల‌రించ‌నున్నాయి. సెకండ్ హాఫ్ లో దాదాపు 40 నిమిషాల యాక్షన్ బ్లాక్స్ హైలైట్ గా నిలుస్తాయని.. ఫైట్ మాస్టర్ దిలిప్ సుబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేస్తున్నారని తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..