సానియా మిర్జా చెల్లెలి రిసెప్షన్‌లో చెర్రీ న్యూ గెటప్..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలు ఆనమ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా.. వీరి రిసెప్షన్ శంషాబాద్‌లోని ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ రిసెప్షన్‌‌కి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. ఈ రిసెప్షన్‌‌కి టాలీవుడ్ అగ్రహీరో.. రాంచరణ్, భార్య ఉపాసనలు కూడా హాజరై సందడి చేశారు. అజహరుద్దీన్, సానియా, చెర్రీ, ఉపాసనలు ఎంతో హుషారుగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:47 pm, Fri, 13 December 19
సానియా మిర్జా చెల్లెలి రిసెప్షన్‌లో చెర్రీ న్యూ గెటప్..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలు ఆనమ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా.. వీరి రిసెప్షన్ శంషాబాద్‌లోని ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ రిసెప్షన్‌‌కి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. ఈ రిసెప్షన్‌‌కి టాలీవుడ్ అగ్రహీరో.. రాంచరణ్, భార్య ఉపాసనలు కూడా హాజరై సందడి చేశారు. అజహరుద్దీన్, సానియా, చెర్రీ, ఉపాసనలు ఎంతో హుషారుగా మాట్లాడుతున్నటు వంటి కొన్ని ఫొటోలు వైరల్‌ అయ్యాయి. సానియా, రాం చరణ్‌ చాలా కాలం నుంచే మంచి స్నేహితులు. కాగా.. న్యూ గెటప్‌లో రాం చరణ్.. రిసెప్షన్‌లో కనిపించారు. ఇది వరకు చరణ్ మెలితిరిగిన మీసాలతో కనిపించాడు. ఇప్పుడు గడ్డెం పెంచి.. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు మేకోవర్‌కు రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది.