మందు కిక్‌తో ఆకట్టుకుంటోన్న కార్తికేయ ’90 ML’

‘ఆర్ఎక్స్‌ 100’తో హీరోగా పరిచయమైన కార్తికేయ… మంచి దూకుడుతో.. సినిమాలు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నాని సినిమాలో విలన్‌గా కనిపించి అలరించిన.. కార్తికేయ.. తాజాగా.. చేసిన చిత్రం ’90 ML’. దీనికి శేఖర్ దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్‌గా నటించింది. తాజాగా.. ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఆద్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా 90 ML ట్రైలర్ ఉంది. పుట్టుకతో వచ్చిన కొన్ని కారణాల […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:18 pm, Thu, 21 November 19
మందు కిక్‌తో ఆకట్టుకుంటోన్న కార్తికేయ '90 ML'

‘ఆర్ఎక్స్‌ 100’తో హీరోగా పరిచయమైన కార్తికేయ… మంచి దూకుడుతో.. సినిమాలు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నాని సినిమాలో విలన్‌గా కనిపించి అలరించిన.. కార్తికేయ.. తాజాగా.. చేసిన చిత్రం ’90 ML’. దీనికి శేఖర్ దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్‌గా నటించింది. తాజాగా.. ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఆద్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా 90 ML ట్రైలర్ ఉంది. పుట్టుకతో వచ్చిన కొన్ని కారణాల వల్ల.. చిన్నప్పటి నుంచీ.. హీరో 90 ML మందు తాగాల్సి వస్తుంది. అయితే.. ఆ మందే అతని పెళ్లికి, ప్రేమకి ఎలాంటి ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఆ సమయంలో.. హీరో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు. చివరికి మందు మానేసి.. అతను బతుకుతాడా..? ఇలా.. అనుకోని కొన్ని ట్విస్టులతో ట్రైలర్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. కాగా.. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది.