Kamal Haasan : కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా భారిన పడిన విషయం తెలిసిందే.ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‏కు కరోనా లక్షణాలు కనిపించాయి.

Kamal Haasan : కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..
Follow us

|

Updated on: Nov 27, 2021 | 1:13 PM

Kamal Haasan : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా భారిన పడిన విషయం తెలిసిందే.ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‏కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం కమల్ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్‏లో ఉన్నట్లుగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో కమల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన కమల్ అనంతరం దగ్గు..జ్వరం..తలనొప్పి మొదలవ్వడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ఆరోగ్యం బాగనే ఉందని కమల్ కుమార్తె హీరోయిన్ శృతిహాసన్ తెలిపింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కమల్ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కమల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం కమల్ చెన్నై లోని కమలహాసన్ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక కమల్ కరోనా భారిన పడటంతో ఆయన మిత్రుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయనకు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా మహమ్మారి నుంచి కోలుకోవాలని రజనీ కోరుకున్నారు. ఇంకా కోలీవుడ్ నుంచి ప్రభు..శరత్ కుమార్..విష్ణు విశాల్..శివకార్తికేయన్..ఎస్పీ ముత్తురామన్.. లోకేష్ కనగరాజ్.. పహద్ పాసిల్.. అట్లీ.. ఇషారీ గణేష్..విక్రమ్ ప్రభు పలువురు దర్శక..నిర్మాతలు కమల్ ఆరోగ్యం పై ఆరాలు తీసారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KS Nageswara Rao: ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

Hari Hara Veera Mallu : తిరిగి పట్టాలెక్కనున్న పవన్ – క్రిష్ సినిమా.. ఎప్పడినుంచి అంటే.

Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- మెగాపవర్ స్టార్.. ఏ సినిమాలో అంటే..