Tollywood: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. ఈ బుజ్జాయిని గుర్తుపట్టండి.. ఈ హీరోయిన్‏ సినిమా వస్తే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే..

తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ.. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.

Tollywood: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. ఈ బుజ్జాయిని గుర్తుపట్టండి.. ఈ హీరోయిన్‏ సినిమా వస్తే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే..
Actress
Follow us

|

Updated on: Nov 18, 2022 | 11:10 AM

పైన ఫోటోలో ఉన్న క్యూట్ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి. దక్షిణాదిలోనే అగ్రకథానాయిక. అందం, అభినయంతో ఇండస్ట్రీలో సక్సెస్‏ఫుల్ గా రాణిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు యమ ఫాలోయింగ్ ఉంటుంది. అగ్రహీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంతేకాదండోయ్.. హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సినిమా వస్తుందంటే థియేటర్లు బ్లాక్ అవ్వాల్సిందే. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ.. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఎవరో గుర్తుపట్టండి. అమాయకత్వమే కాదు.. గ్లామర్ షోకు.. పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు అయిన పెట్టింది పేరు. ఎవరో గుర్తుపట్టండి. ఎన్ని హిట్ చిత్రాల్లో నటించినా.. మీడియా ముందుకు వచ్చేందుకు మాత్రం ఇష్టపడదు. సినిమా ప్రమోషన్లలో అస్సలు పాల్గొనదు. ఇంటర్యూలకు.. షోలకు.. అటెండ్ కాదు. గుర్తుపట్టే ఉంటారు కదూ.. ఈ రోజు తన పుట్టినరోజు.

హా మీరు అనుకున్నట్టే తను లేడీ సూపర్ స్టార్ నయనతార. చంద్రముఖి సినిమాలో అమాయకపు దుర్గల కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. కేరళలోని తిరువల్లాకు చెందిన నయన్.. ఆంగ్ల సాహిత్యంలో బీఏ పూర్తిచేసింది. మనసిక్కరే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన నయన్.. లక్ష్మీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. బాస్, దుబాయ్ శీను, తులసి, అదుర్స్, బాడీగార్డ్, సింహా, శ్రీరామరాజ్యం, సైరా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో కీలకపాత్రలో నటించింది.

ఇవి కూడా చదవండి

తమిళ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఆరేళ్లు ప్రేమలో ఉన్న నయన్.. ఈ ఏడాది జూన్ 9న కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అక్టోబర్ 9న సరోగసి ప్రక్రియ ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. ప్రస్తుతం నయన్.. షారుఖ్.. డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..