Pakka Commercial: గోపిచంద్‌ కెరీర్‌లోనే హైయ్యెస్ట్‌ ఓపెనింగ్స్‌.. పక్కా కమర్షియల్‌ ఫస్డ్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే..

Pakka Commercial Collections: మ్యాచో హీరో గోపీచంద్‌ (Gopichand), అందాల తార రాశీఖన్నా (Raashi Khanna) మరోసారి జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌ (Pakka Commercial). కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలతో..

Pakka Commercial: గోపిచంద్‌ కెరీర్‌లోనే హైయ్యెస్ట్‌ ఓపెనింగ్స్‌.. పక్కా కమర్షియల్‌ ఫస్డ్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే..
Pakka Commercial
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 03, 2022 | 7:59 AM

Pakka Commercial Collections: మ్యాచో హీరో గోపీచంద్‌ (Gopichand), అందాల తార రాశీఖన్నా (Raashi Khanna) మరోసారి జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌ (Pakka Commercial). కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి (Maruti) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం (జులై1)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టైటిల్‌కు తగ్గట్లే కమర్షియల్‌ పక్తు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది. గోపిచంద్‌ యాక్షన్‌కి తోడు, రాశిఖన్నా అందం, అభినయం, మారుతి స్టైల్‌ కామెడీకి సినిమా ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈనేపథ్యంలో టాక్‌కు తగ్గట్టుగానే తొలి రోజు పక్కా కమర్షియల్‌ చిత్రం భారీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. మొదటి రోజు మొత్తంగా ఈ చిత్రం రూ.6.3 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది.

దీంతో పాటు గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కాయని చిత్రబృందం తెలిపింది. ఇక ఈ వారం కూడా పెద్ద సినిమాలేవి బరిలో లేకపోడంతో వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా కోర్ట్‌ రూమ్‌ డ్రామగా రూపొందిన ఈ సినిమాలో త్యాగరాజ్‌, రావురమేశ్‌, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు.వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అతిథి పాత్రలో మెరిసింది. జేక్స్ బిజాయ్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..