Bigg Boss 6: బయటకు రావడానికి అదే కారణం అంటే నేను ఒప్పుకోను..గీతూ సెన్సేషనల్ కామెంట్స్

హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఎమోషన్స్ లేవు నేను ఏడవును అని చెప్పిన గీతూ.. బయటకు రాగానే ఎక్కెక్కి ఏడ్చేసింది. నేను వెళ్లనూ అంటూ గుక్కపెట్టి మరి ఏడ్చేసింది.

Bigg Boss 6: బయటకు రావడానికి అదే కారణం అంటే నేను ఒప్పుకోను..గీతూ సెన్సేషనల్ కామెంట్స్
Geetu Royal
Follow us

|

Updated on: Nov 08, 2022 | 9:05 PM

బిగ్ బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా బయటకు వచ్చింది గీతూ.. టాప్ 5లో ఉంటానని కప్పు కూడా నాదే అని అనౌన్స్ చేసుకున్న గీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం కొంత మందికి షాక్ ఇచ్చింది. హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఎమోషన్స్ లేవు నేను ఏడవును అని చెప్పిన గీతూ.. బయటకు రాగానే వెక్కి వెక్కి ఏడ్చేసింది. నేను వెళ్లనూ అంటూ గుక్కపెట్టి మరి ఏడ్చేసింది. ఎలిమినేషన్ లో శ్రీ సత్య, గీతూ పోటీపడగా గీతూ అవుట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఓట్లు తక్కువ పడటంతో గీతూ బయటకు వచ్చేసింది. మొదట్లో ఈమె గేమ్ చూసి చాలా మంది తిట్టుకున్నారు. నాకు అంతా తెలుసు నాకు నచ్చినట్టే ఆడతా అంటూ.. హౌస్ లో రచ్చ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతూ మాట్లాడుతూ తన ఎలిమినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

గీతూ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి నిమిషం గెలవడం కోసమే ఆడాను. కానీ జనానికి నేను నచ్చలేదేమో అని చెప్పుకొచ్చింది. నాలోని లోపాలను సరి చేసుకుంటూనే వస్తున్నాను. అయినా ఎలిమినేట్ అవ్వాల్సొచ్చింది. హౌస్ లో అందరితో పెద్దగా స్నేహం ఏర్పడటానికి ముందు నేను కాస్త దూకుడుగా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఆ తరువాత నా లోని లోపాలను నాగార్జున గారు చెబుతూ ఉంటే సరిదిద్దుకుంటూ వచ్చాను అని తెలిపింది గీతూ.

సిగరెట్లు – లైటర్ దాచేసినందుకు నన్ను బాలాదిత్య చాలా మాటలు అన్నాడు. నేను నటిస్తున్నానని ఆయన అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించింది. నేను హర్ట్ అయ్యాను. అందువల్లనే గేమ్ అయిపోయిన వెంటనే కూడా తిరిగి ఆయనకి లైటర్ – సిగరెట్లు ఇవ్వలేదు. నేను ఎవ్వరిని పర్సనల్ గా టార్గెట్ చేయను. ఎవరి ఎమోషన్స్ ను హర్ట్ చేయను. చేపల టాస్క్ లో సంచాలక్ గా నేను వ్యవహరించిన తీరు తప్పంటే ఒప్పుకోనూ అలాగే బాలాదిత్య విషయం కారణంగానే నేను ఎలిమినేట్ అయ్యాను అంటే కూడా నేను ఒప్పుకోనూ.. నేను మొదటి నుంచి నాలానే ఉన్నా.. “అని చెప్పుకొచ్చింది గీతూ.

ఇవి కూడా చదవండి
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!