‘కూలి నెం.1’ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..

'కూలి నెం.1' సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..

బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ముంబయిలోని ఫిల్మీస్థాన్‌ స్టూడియోలో ఓ భారీ సెట్‌ను వేశారు. సెప్టెంబర్‌ 11వ తేదిన ఈ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం తర్వాత ఆ చిత్ర నిర్మాత సోషల్‌మీడియా వేదికగా ‘సెట్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బందికి, ముంబయి పోలీసులకు ధన్యవాదాలు. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Sep 19, 2019 | 6:16 PM

బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ముంబయిలోని ఫిల్మీస్థాన్‌ స్టూడియోలో ఓ భారీ సెట్‌ను వేశారు. సెప్టెంబర్‌ 11వ తేదిన ఈ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం తర్వాత ఆ చిత్ర నిర్మాత సోషల్‌మీడియా వేదికగా ‘సెట్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బందికి, ముంబయి పోలీసులకు ధన్యవాదాలు. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.’ అని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం సెట్‌లో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదం వల్ల చిత్రబృందానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని బాలీవుడ్‌లో వినికిడి. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సెట్‌కి ఇన్సూరెన్స్ చేయించడంతో క్లైయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

వరుణ్‌ధావన్‌, సారా అలీఖాన్‌ నటిస్తున్న ‘కూలీ నం1’ చిత్రానికి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్‌ చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన కారణంగా కొన్ని రోజుల పాటు ఈ షూటింగ్‌ను వాయిదా వేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu