Devara : కడపలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ .. టిక్కెట్లు లేకుండా ధియేటర్లోకి వచ్చి హంగామా

| Edited By: Rajeev Rayala

Sep 27, 2024 | 10:20 AM

కడప నగరంలోని రాజా థియేటర్లో అభిమానులు రచ్చ రచ్చ చేశారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిర్వహించిన ఫ్యాన్స్ షోలో టికెట్ లేకుండా అభిమానులు అందరూ థియేటర్లోకి వచ్చేయడంతో థియేటర్ అంతా కూర్చోవడానికి కూడా ఖాళీ లేకుండా జనంతో నిండిపోయింది..

Devara : కడపలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ .. టిక్కెట్లు లేకుండా ధియేటర్లోకి వచ్చి హంగామా
Devara
Follow us on

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కు సంబంధించి అర్ధరాత్రి నిర్వహించిన ఫ్యాన్స్ షో లో అభిమానులు అలజడి సృష్టించారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగే షోకు టికెట్లు లేకుండా థియేటర్లోకి ప్రవేశించి అలజడి చేశారు సెల్ఫోన్లతో సినిమా రికార్డు చేస్తూ నానా హంగామా సృష్టించారు టికెట్లు ఉన్న అభిమానుల మధ్య లేని అభిమానుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో యాజమాన్యం కొద్దిసేపు సినిమాను ఆపేసి టికెట్ లేని వారందరిని బయటకు పంపించింది.

ఇది కూడా చదవండి :Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

కడప నగరంలోని రాజా థియేటర్లో అభిమానులు రచ్చ రచ్చ చేశారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిర్వహించిన ఫ్యాన్స్ షోలో టికెట్ లేకుండా అభిమానులు అందరూ థియేటర్లోకి వచ్చేయడంతో థియేటర్ అంతా కూర్చోవడానికి కూడా ఖాళీ లేకుండా జనంతో నిండిపోయింది.. సినిమా ఆ సమయానికే ప్రారంభం కావడంతో లోపల ఉన్న వారంతా నిలబడే సెల్ఫోన్లో చిత్రీకరించడం మొదలుపెట్టారు అయితే టికెట్ ఉన్నవాళ్లు టికెట్ లేని వారిని అడ్డుకొని మీరంతా బయటకు వెళ్లాలి అని వారించడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే ఈ సంఘటనను గమనించిన థియేటర్ యాజమాన్యం సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత సినిమాను ఆపివేసి టిక్కెట్ లేని వారందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేశారు అయితే కొంతమంది అభిమానులు యాజమాన్యంపై కూడా దురుసు ప్రవర్తన చేయడంతో ఆ సమయంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే పూర్తిగా టికెట్ లేని వారందరినీ బయటికి పంపించిన తర్వాతే దాదాపు అరగంట లేటుగా సినిమాను ప్రదర్శించారు.

ఇది కూడా చదవండి :Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు భారీగా చేరుకొని హంగామా చేశారు అయితే ఇదంతా గమనిస్తున్న పోలీసులు వారిని నిలువరించలేక స్వల్ప లాటి చార్జింగ్ చేయడంతో కొంత కంట్రోల్ లోకి వచ్చారు తర్వాత ఒక్కొక్కరిగా అభిమానులను లోపలికి అనుమతించడంతో సినిమా ప్రారంభమయ్యే సమయానికి టికెట్ లేని వారు కూడా పూర్తిగా లోపలికి తెచ్చుకొని రావడం సినిమా ప్రదర్శన జరగగానే సెల్ఫోన్లతో రికార్డు చేయటం ఇదంతా గమనించిన యాజమాన్యం సినిమాను అరగంట సేపు నిలువరించి ఆ తర్వాత ప్రదర్శించడం జరిగాయి.

ఇది కూడా చదవండి : Tollywood : ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు.. కానీ వరుస ఆఫర్స్.. కారణం ఇదేనా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.నాటారు