Mahesh Babu: ఈ ఫొటోలో మహేష్‌తో హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది

ఒకప్పటి హీరోలు, హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి గూగుల్ ను గాలించేస్తు ఉంటారు. పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న సీనియర్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

Mahesh Babu: ఈ ఫొటోలో మహేష్‌తో హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది
Mahesh Babu
Follow us

|

Updated on: Jan 25, 2023 | 7:22 AM

సినిమా తారలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా పాతకాలం హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు నెటిజన్స్. ఒకప్పటి హీరోలు, హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి గూగుల్ ను గాలించేస్తు ఉంటారు. పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న సీనియర్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఫోటో దిగిన ఆమె ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కనిపెట్టారా..? ఆమెకు అప్పట్లో విపరీతమైన పాలోయింగ్ ఉంది. ఇంతకు మహేష్ తో ఫోటో దిగిన ఆమె ఎవరంటే..?

పై ఫొటోలో మహేష్ బాబు పక్కన కనిపిస్తున్న హీరోయిన్ పేరు మాలాశ్రీ. మాలా శ్రీ అంటే ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో తెలుసా..? ఆమె కోసం ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేవారు. తెలుగులో ప్రేమ ఖైదీ, బావ బావమరిది, సాహసవీరుడు సాగర కన్య లాంటి సినిమాలు చేశారు మాలా శ్రీ. ఆమెను అప్పట్లో డ్రీమ్ గర్ల్ గా పిలిచేవారు.

ప్రస్తుతం మాలా శ్రీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పట్లో విజయశాంతికి పోటీగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి అలరించారు మాలా శ్రీ. ఇక ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నిర్మాత రామును ఆమె పెళ్లాడిన తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు మహేష్.