Sakshi Chudhary: అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..

|

Sep 25, 2024 | 10:49 AM

తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. చాలా కాలం తర్వాత సాక్షి చౌదరి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పటికీ ఇప్పటికే ఎలాంటి మార్పు లేకుండా అదే అందం, ఫిట్నెస్ తో షాకిస్తుంది సాక్షి. మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాక్షి.

Sakshi Chudhary: అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..
Sakshi Chowdary
Follow us on

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రాల్లో ‘జేమ్స్ బాండ్’ ఒకటి. డైరెక్టర్ సాయి కిషోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2015లో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇందులో అల్లరి నరేష్ సరసన సాక్షి చౌదరి కథానాయికగా నటించింది. అలాగే అశిష్ విద్యార్థి, రఘుబాబు, కృష్ణ భగవాన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది సాక్షి చౌదరి. కానీ ఆ తర్వాత మాత్రం మరో సినిమా చేయలేదు. జేమ్స్ బాండ్ సినిమా తర్వాత అనుహ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది సాక్షి. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. చాలా కాలం తర్వాత సాక్షి చౌదరి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పటికీ ఇప్పటికే ఎలాంటి మార్పు లేకుండా అదే అందం, ఫిట్నెస్ తో షాకిస్తుంది సాక్షి. మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాక్షి.

ఆ తర్వాత తెలుగులోనే అల్లరి నరేష్ సరసన జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. యాక్షన్ హీరో గోపిచంద్ నటించిన ఆక్సిజన్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఆ సాంగ్ ఏమాత్రం కలిసిరాలేదు. దీంతో తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటించిన సాక్షి.. ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నిత్యం గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. మోడ్రన్ డ్రెస్సులలో మతిపోగొట్టేస్తున్న ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. గతంలో ఈ బ్యూటీకి కాస్టింక్ కౌచ్ ఎదురైనట్లు తెలిపింది. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని.. అందుకు కమిట్మెంట్ అడిగారని గతంలో చెప్పుకొచ్చింది. చాలా కాలం తర్వాత సాక్షి చౌదరి లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ బ్యూటీ 1993 నవంబర్ 18న ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జన్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.