ఒకే ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే 260కు పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్

ఆమె ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఫేమస్ నటి. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. 55 ఏళ్లు దాటినా పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన సినిమాలు దాదాపు అన్నీ వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినవే.

ఒకే ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే 260కు పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్
Actress

Updated on: Oct 23, 2025 | 9:06 PM

ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. గట్టిగా చేస్తే పది సినిమాలతో ఫెడ్ అవుట్ అవుతున్నారు. మరికొంతమంది మరీ దారుణంగా ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి బై బై చెప్పేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క బాషలోనే కాదు.. తెలుగు, తమిళ్, కన్నడ ఇప్పుడు హిందీ ఇలా రకరకాల భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఇకపోతే.. ఎంత చేసినా ఓ వందల సినిమాలు చేస్తారేమో మహా అయితే.. కానీ పైన కనిపిస్తున్న హీరోయిన్ ఏకంగా 200లకు పైగా సినిమాలు చేసింది. ఒక బిస్కెట్ యాడ్ ఆమె కెరీర్ ను మార్చేసింది. ఆ యాడ్ పుణ్యమా అని ఆమెను ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ ను చేసింది.

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది హీరోయిన్స్ ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్స్ గా ఎపికైనా వారే.. కానీ కొంతమందికి మాత్రం అదృష్టం వెతుకుంటూ వస్తుంది. యాడ్స్ లో నటించిన వారు హీరోయిన్స్ గా మారిన సందర్భాలు చాలా తక్కువ.. పైగా అప్పట్లో .. అలా వచ్చిన ఓ ముద్దుగుమ్మ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో, నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది రమ్యకృష్ణ.

ఇవి కూడా చదవండి

అయితే ఈ అమ్మడి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే.. వెల్లై మనసు సినిమాలో మహిళ ప్రధాన పాత్ర కోసం వెతుకుతున్నారట చిత్ర నిర్మాతలు. ఇంతలో యాదృచ్ఛికంగా  కుముదం అనే వార్తాపత్రికలో.. ఓ బిస్కెట్ కు సంబందించిన యాడ్ లో రమ్యకృష్ణ కనిపించిందట. ఈ అమ్మడు బాగుంది. ఎవరో కనుక్కోండి అని నిర్మాతలు చెప్పడంతో సిబ్బంది ఆరా తీశారట. దాంతో ఆమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు అని తెలిసిందట. దాంతో మూవీ మేకర్స్  చో రామస్వామిను రమ్యకృష్ణను ను నటింపచేయాలని అడిగారట. ఆ తర్వాత దర్శకుడు వెళ్లి ఆమెను కలుసుకుని మొదటి సినిమా “వెల్లై మనసు”కి నటిగా సైన్ చేయించడం జరిగిందట. అలా సినిమాల్లోకి వచ్చారు రమ్యకృష్ణ. ఆ సినిమా సమయానికి రమ్యకృష్ణది చిన్న వయసు. ఎనిమిదో తరగతి చదువుతూనే తమిళంలో ‘వెల్లై మనసు’లో ప్రధాన ప్రాత పోషించింది. ఆతర్వాత బాల్యమిత్రులు అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇక హీరోయిన్ గా ఈబ్యూటీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా నరసింహ సినిమాలో రజినీకాంత్ తో పోటీపడి నటించి మెప్పించింది. ఇకప్పుడు తల్లిగా, అత్తగా పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. బాహుబలి సినిమాలో ఆమె చేసిన శివగామి పాత్ర రమ్యకృష్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి