Tollywood: నయనతార, త్రిష, రష్మిక.. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా.. ?

ప్రస్తుతం సినీరంగంలో హీరోలకు పోటీగా హీరోయిన్స్ సైతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే రెమ్యునరేషన్స్ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు తెలుగుతోపాటు హిందీలోనూ చక్రం తిప్పుతున్న తారలు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా.. ? నయనతార, రష్మిక మందన్నా, త్రిషతోపాటు సాయిపల్లవి, సమంత రెమ్యునరేషన్ వివరాలు మీకోసం

Tollywood: నయనతార, త్రిష, రష్మిక.. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా.. ?
Trisha, Nayanthara, Rashmik

Updated on: Nov 02, 2025 | 1:03 PM

ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో దక్షిణాది హీరోయిన్స్ చక్రం తిప్పుతున్నారు. ఇదివరకే జవాన్ చిత్రంతో హిందీలో నయనతార బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ సినిమాతో బీటౌన్ లోకి ఎంట్రీ ఇస్తుంది రష్మిక. ఇదంతా పక్కన పెడితే… టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసుకుందామా. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ నటీమణులు ఎవరు ? ప్రతి సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అనేది చూద్దాం.

ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో అగ్రస్థానంలో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తమిళం, తెలుగు, హిందీ భాషలలో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక ఒక్కో సినిమాకు రూ.13 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అంతకు ముందు ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల వరకు తీసుకునేది.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఆ తర్వాత దాదాపు 20 ఏళ్లకు పైగా అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్ త్రిష. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఒక్కో సినిమాకు దాదాపు 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. మొన్నటివరకు ఆమె రూ.10 కోట్లు వసూలు చేసిందట.

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ. 6 నుండి రూ. 10 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది.

ఇక సమంత మాత్రం ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు తీసుకుంటుంది. అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన అనుష్క శెట్టి.. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 4 నుండి రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.

రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో నటించిన శ్రుతి హాసన్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఒక్కో సినిమాకు 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుంది.

తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకర్షించిన సాయి పల్లవి, కథా ఆధారిత చిత్రాలను ఎంచుకుంటుంది. ఆమె ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 5 కోట్లు తీసుకుంటుంది. దాదాపు 20 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్న తమన్నా ఇప్పుడు హిందీలో స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. ఆమె ఒక్కో చిత్రానికి రూ. 4 నుండి రూ. 5 కోట్లు వసూలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?