Arundhati Movie: అరుంధతి సినిమాలో నటించిన ఈ నటి కూతురు తెలుగులో తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా..?

దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క నటనపై ప్రశంసలు వచ్చాయి. ఇందులో జయసుధ చెల్లెల్లు సుభాషిణి సైతం తెలుగులో టాప్ నటి.

Arundhati Movie: అరుంధతి సినిమాలో నటించిన ఈ నటి కూతురు తెలుగులో తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Subhashini
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 30, 2024 | 8:22 PM

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క నటించిన అరుంధతి చిత్రం ఏ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అనుష్క నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. అనుష్క అద్భుతమైన నటన, కోడి రామకృష్ణ దర్శకత్వం, సోనూసూద్ విలన్, కీరవాణి సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి.ఈ చిత్రంలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. అలాంటివారిలో సుభాషిణి ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ సోనూసూద్ తల్లి పాత్రలో అదరగొట్టేసింది.

ఈ చిత్రంలో సుభాషిణి చెప్పే “విడుదల.. నా బిడ్డకు విడుదల” డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. నాగమ్మ, నాగస్త్రం వంటి సీరియల్స్‌లో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సుభాషిణి. అరుంధతి సినిమా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

Subhashini Daughter

Subhashini Daughter

కానీ మీకు తెలుసా..సుభాషిణి అక్కయ్య జయసుధ. తెలుగులో ఒకప్పుడు సీనియర్ హీరోయిన్. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా. ఇక సుభాషిణి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్. సుభాషిణి కుమార్తె పేరు పూజ. ఆమె డైరెక్టర్ పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ 143 చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో పూజకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఆమె ఏ సినిమా చేయలేదు. అకెలా చంద్రశేఖర్‌ను వివాహం చేసుకుని తన కుటుంబంతో నివసిస్తుంది.

Pooja

Pooja

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.