Aishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? తన భర్త కంటే ఎక్కువ ధనవంతురాలు..

ఐశ్వర్యరాయ్.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఒకప్పుడు యావత్ భారతీయ సినిమా ప్రపంచాన్ని ఏలిన అందాల సుందరి. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో చక్రం తిప్పింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ ఫ్యాన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాయ్ ఆస్తులు, సంపాదన గురించి మీకు తెలుసా.. ?

Aishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? తన భర్త కంటే ఎక్కువ ధనవంతురాలు..
Aishwarya Rai

Updated on: Nov 01, 2025 | 9:01 PM

ఒకప్పుడు భారతీయ సినిమా ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఐశ్వర్య పేరు వార్తలలో నిలుస్తుంటుంది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితం గురించి ఏదోక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలు.. అభిషేక్ బచ్చన్ భార్యగా జీవితాన్ని గడుపుతుంది. ఒకప్పుడు సినిమాల్లో చక్రం తిప్పిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎంత ధనవంతురాలు.. ఆమె మొత్తం సంపద ఎంత అని తెలుసుకుందాం?

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

1973 నవంబర్ 1న జన్మించింది ఐశ్వర్య రాయ్. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆమె.. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. భారతీయ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. అందమైన రూపం, నీలికళ్లతో సినీప్రియుల హృదయాలను కొల్లగొట్టింది. నివేదికల ప్రకారం ఐశ్వర్య రాయ్ బచ్చన్ భారతదేశంలోనే రెండవ ధనిక నటి. అలాగే ఐశ్వర్య తన ప్రతి సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఐశ్వర్య రాయ్ నటనతో పాటు, హై-ఎండ్ ఇండియన్, అంతర్జాతీయ బ్రాండ్‌లను ఎండార్స్ చేయడం ద్వారా కూడా 6-7 కోట్లు సంపాదిస్తుంది. నటన, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో పాటు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యాపార ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

వ్యాపారాల్లో పెట్టుబడులతోపాటు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన వ్యాపార మహిళలలో ఒకరిగా నిలిచింది. ఐశ్వర్య రాయ్ కి చాలా ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ముంబైలోని బాంద్రాలో 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తోంది. ఆమెకు దుబాయ్‌లోని సాన్క్చురి ఫాల్స్‌లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో ఒక విలాసవంతమైన విల్లా కూడా ఉంది. ఐశ్వర్య మొత్తం సంపద రూ. 900 కోట్లు అని సమాచారం.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?