Varasudu: ‘వారసుడు డైలీ సీరియల్’ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి..

వారసుడు సినిమా డైలీ సీరియల్ అంటూ నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ కామెంట్స్ పై డైరెక్టర్ వంశీ పైడిపల్లి అసహనం వ్యక్తం చేశారు. అలాంటి డైలీ సీరియల్స్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయని.. కానీ సినిమా తీయడం సాధారణ విషయేమీ కాదంటూ సీరియస్ అయ్యారు.

Varasudu: 'వారసుడు డైలీ సీరియల్' అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి..
Varasudu Movie,
Follow us

|

Updated on: Jan 18, 2023 | 7:37 AM

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి సంక్రాంతి కానుకగా వారసుడు సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. జనవరి 14న విడుదలైన సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించగా.. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ అనుకున్నంత స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. అయితే ఓవైపు ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమా డైలీ సీరియల్ అంటూ నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ కామెంట్స్ పై డైరెక్టర్ వంశీ పైడిపల్లి అసహనం వ్యక్తం చేశారు. అలాంటి డైలీ సీరియల్స్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయని.. కానీ సినిమా తీయడం సాధారణ విషయేమీ కాదంటూ సీరియస్ అయ్యారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ” సినిమానూ డైలీ సీరియల్స్‏తో పోల్చడం ఏంటీ ? సాయంత్రమైతే ఎంతమంది టీవీలు చూస్తారో మీకు తెలుసా ?. మీ ఇళ్లలో ప్రతి ఒక్కరూ ఎదో ఒక ధారవాహిక చూస్తుంటారు. సీరియల్స్ ను ఎందుకు కించపరుస్తున్నారు. అది ఒక క్రియేటివిటీ ఉద్యోగం. ఈరోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఇదంతా టీమ్ వర్క్. ప్రేక్షకులను అలరించడానికి మేం పడే కష్టం ఎలా ఉంటుందో మీకు తెలుసా ? .. ప్రతి సినిమా వెనక ఎన్నో త్యాగాలు..ఉంటాయి. మన దేశంలో సూపర్ స్టార్స్ లో విజయ్ కూడా ఒకరు.

ప్రతి సన్నివేశానికి రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయగలమనేది మా చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు.. ఆయనే నా సినిమాకు సమీక్షకుడు. విమర్శకుడు. ఆయన కోసం మాత్రమే ఈ సినమా చేశాను. మరీ ఇంత నెగిటివ్ గా ఉండకంటి. సాఫ్ట్ వేరు జాబ్ వదిలి ఇక్కడికీ వచ్చాను. నా పనిని.. నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోను. ఈరోజు నేనేంటో నాకు తెలుసు. కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో దాన్ని విశ్లేషించండి. నేను కమర్షియల్ సినిమాను తీశాను బ్రదర్. కేవలం ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే ఈ సినిమా చేశాను” అంటూ చెప్పుకచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..