డిక్టేటర్ వంటి డిజాస్టర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ కు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చారా..?

నందమూరి అభిమానులంతా బాలయ్య బాబు సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి తో కలిసి ముచ్చటగా..

డిక్టేటర్ వంటి డిజాస్టర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ కు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చారా..?
Balakrishna
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Jul 12, 2021 | 6:05 AM

Nandamuri Balakrishna: నందమూరి అభిమానులంతా బాలయ్య బాబు సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి తో కలిసి ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ సినిమా అఖండ అనే అదిరిపోయే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసాడు బోయపాటి. ఇప్పటికే సింహ, లెజెండ్వంటి సంచలన విజయాలను బాలయ్య ఖాతాలో వేసిన బోయపాటి ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే గతంలో బాలయ్యతో డిక్టేటర్ వంటి డిజాస్టర్ ను తెరకెక్కించిన శ్రీవాస్ దర్శకత్వంలో ఇప్పుడు ఆయన సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే శ్రీవాస్ బాలయ్యను కూడా సంప్రదించారని తెలుస్తుంది.

ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమా తర్వాత చేయబోతున్న గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత శ్రీవాస్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. శ్రీవాస్ చివరిగా 2018 లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం సినిమాను తెరకెక్కించాడు. ఆతర్వాత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.  మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ బాలయ్యతోనే శ్రీవాస్ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నారు. బాలయ్య కోసం అదిరిపోయే స్టోరీని సిద్ధం చేశారట శ్రీవాస్. మరి ఈ దర్శకుడు  ఈ సారైనా బాలయ్య కు హిట్ ఇస్తాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nagarjuna OTT: ఓటీటీ వార్తలపై స్పందించిన నాగార్జున.. త్వరలోనే ఓ ప్రయోగత్మక సినిమాలో నటించనున్నట్లు.

Vishal: పప్పులో కాలేసిన హీరో విశాల్ .. ఆడుకున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

Ram Charan: కొత్త ఇల్లు కొన్న రామ్ చరణ్ ఉపాసన దంపతులు.. ధర ఎంతంటే…?? ( వీడియో )

Ajith Valimai: అజిత్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కార్తికేయ.. ఆకట్టుకుంటోన్న వలిమై ఫస్ట్‌లుక్‌. అభిమానులకు పండగే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu