‘పర్ ఫెక్ట్ హస్బెండ్, పర్‌ఫెక్ట్ వైఫ్ ఎవరూ ఉండరు’.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘పూరి మ్యూజింగ్స్’

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ పూరి మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఒక వీడియోలో పెళ్లిళ్లు, భార్య, దేవుళ్ల గురించి పూరి చేసి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అది కూడా ఐదేళ్ల క్రితం పూరి చెప్పిన మాటలను ఇప్పుడు ఉన్నట్లుండి వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

పర్ ఫెక్ట్ హస్బెండ్, పర్‌ఫెక్ట్ వైఫ్ ఎవరూ ఉండరు.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పూరి మ్యూజింగ్స్
Director Puri Jagannadh

Updated on: May 24, 2026 | 3:28 PM

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ గుర్తు పెట్టుకునే పలు హిట్ సినిమాలు తీశారాయన. ప్రస్తుతం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే.. పూరి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. విషయమేదైనా ముక్కుసూటిగా ఫిల్లర్ లేకుండ మాట్లాడతాడు. అలా తన మనసులోని భావాలు, ఆలోచనలను పూరి మ్యూజింగ్స్ పేరుతో అందరితో షేర్ చేసుకుంటున్నారు పూరి. మన జీవితానికి సంబంధించి అన్న రకాల అంశాలను తన దైన శైలిలో విశ్లేషిస్తుంటారాయన. అయితే తాజాగా పూరి.. పెళ్లి, భార్యల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ఆడియో ఇప్పటిది కాదు.. దాదాపు 5 ఏళ్ల క్రితం పూరి ఈ మాటలన్నాడు. అయితే ఉన్నట్లుండి ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పూరీ ఏం చెప్పుకొచ్చారంటే..

‘పెళ్లైన ఆడాళ్లందరికీ ఓ విన్నపం.. జీవితంలో ఫర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు.. ఫర్ఫెక్ట్ డ్రైవర్.. ఫర్ఫెక్ట్ నర్స్ ఉండొచ్చు.. కానీ, ఫర్ఫెక్ట్ హస్బెండ్ మాత్రం ఉండడు. ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి.. ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి.. ఇలాగే.. ఇలాగే అని ఎంత పెద్ద లిస్ట్ రాసుకున్నా అన్ని సమస్యల్లో పడి పోతారు. భర్తను కస్టమైజ్ చేయలేము.అందుకే ప్రతి ఆడది పెళ్లైన తరువాత కన్నీళ్లు పెట్టాల్సిందే. తప్పదు. ఎక్కువగా భర్తనే ఏడిపిస్తాడు. జీవితాంతం ఉంటాడు కదా. భర్త చేసే తప్పులే తండ్రి, తమ్ముడు చేస్తే అడ్జెస్ట్ అయిపోతుంటారు. మీరు మీ నాన్నను క్షమించలేదా.. అలాగే మీ భర్తలను క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీళ్లు చూడటం పక్కింటి వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకే వారు చెప్పే చాడీలు, సలహాలు విని కట్టుకున్న భర్తతో గొడవలు పెట్టుకుని జీవితాన్ని పాడుచేసుకోవద్దు. ఆవిడ భర్త ఏమి శ్రీరామ చంద్రుడు కాదు.. నిజం చెప్పాలంటే.. భర్త ఎంత గొప్పవాడు అయితే భార్యకు అన్ని కన్నీళ్లు వస్తాయి. ‘

‘తప్పు చేసిన భర్తని.. మీ అన్నో, తమ్ముడో అని అనుకోని వదిలేయండి. జీవితంలో మీ భర్త లేకున్నా ఆ ఏడుపు ఉంటూనే ఉంటుంది. మేము మగాళ్ళం.. మా అమ్మలు అనుకొనేంత మంచివాళ్లం మాత్రం కాదు. అలాగే మా భార్యలు అనుకునేంత దుర్మార్గులం కాదు. దయచేసి అర్ధం చేసుకోండి. ఇక్కడ ఫర్ఫెక్ట్ హస్బెండ్ కానీ, ఫర్ఫెక్ట్ వైఫ్ ఉండరు. పెళ్లి అంటేనే అడ్జెస్ట్ మెంట్ ఆఫ్ ఇండియా’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పూరి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవుళ్లు, మహిళల గురించి పూరీ జగన్నాథ్ ఇలా మాట్లాడి ఉండాల్సి కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం 5 ఏళ్ల క్రితం వచ్చిన ఆడియో గురించి ఇప్పుడు మాట్లాడమేంటి? అని డైరెక్టర్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై పూరి జగన్నాథ్ స్పందించారు.. ‘ఆ ఆడియో ఇప్పటిది కాదు. దాదాపు ఐదేళ్ల క్రితం నాటిద. సమాజంలో భార్యాభర్తల మధ్య ఉండే అడ్జస్ట్మెంట్లను వివరించడానికి సరదాగా చేసిన పాడ్ కాస్ట్ అది. దాన్ని ఇప్పుడు కావాలనే కొందరు స్క్రీన్ షాట్లు, క్లిప్పులు తీసి వివాదంగా మారుస్తున్నారు. పురాణాలను లేదా దేవుళ్లను అవమానించాలనే ఉద్దేశం నాకు అసలు లేదు. కేవలం గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా భార్యలకు కష్టాలు తప్పలేదనే లాజిక్ ను చెప్పడానికే ఆ ఉదాహరణలు వాడాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అని పూరి కోరారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us