AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్‌లో భూకంపం, సునామి.. టెన్షన్‌లో ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ సేఫ్ అంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు.

జపాన్‌లో భూకంపం, సునామి.. టెన్షన్‌లో ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ సేఫ్ అంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Dec 09, 2025 | 1:01 PM

Share

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకెక్కించింది. బాహుబలి సినిమా రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాలో రానా, అనుష్క , రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాగా కేవలం ఇండియాలోనే కాదు ఇతర భాషల్లోనూ, విదేశాల్లోనూ విడుదలై సంచలన విజయం  అందుకుంది. ముఖ్యంగా జపాన్ లో బాహుబలి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవలే బాహుబలి రెండు పార్ట్స్ ను కలిపి బాహుబలి ఎపిక్ అని ఒకే భాగంగా సినిమా విడుదల చేశారు.

తెలుగులో ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు జపాన్ లో బాహుబలి ఎపిక్ ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డార్లింగ్ ప్రభాస్ జపాన్ వెళ్ళాడు. అక్కడ ఫ్యాన్స్ ను కలిశాడు రెబల్ స్టార్. బాహుబలి రిలీజ్ సమయంలో రాజమౌళి , రానా నిర్మాతలు మాత్రమే జపాన్ వెళ్లారు. ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ జపాన్ వెళ్లి ఫ్యాన్స్ ను కలిశారు.

ఫ్యాన్స్ మీట్ లో ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి తర్వాత రాజమౌళి గారు, షోబు గారు, లక్ష్మి గారు (షోబు భార్య) అందరూ జపాన్ ఫ్యాన్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరు చాలా బ్యూటిఫుల్, ఎమోషనల్ ఫ్యాన్స్. చివరి 10 సంవత్సరాలుగా జపాన్ గురించి చాలా విన్నాను.” “జపాన్ రావడం నా డ్రీమ్ కమ్ ట్రూ! మీ అందరిని చూసి చాలా హ్యాపీగా ఉన్నాను ప్రతి ఏడాది జపాన్ రావడానికి ప్రయత్నిస్తా అని చెప్పారు ప్రభాస్. ఇదిలా ఉంటే జపాన్ లో భూకంపం, సునామి రావడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ప్రభాస్ జపాన్ లోనే ఉండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ మేరకు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దాంతో రాజా సాబ్ దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తో మాట్లాడాను. ఆయన టోకియోలో లేడు.. సేఫ్ గానే ఉన్నాడు. టెన్షన్ పడొద్దు అని అభిమానులకు దైర్యం చెప్పారు మారుతి. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Hero Prabhas

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్లోబల్‌ ఫిల్మ్‌ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే ప్లాన్‌
గ్లోబల్‌ ఫిల్మ్‌ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే ప్లాన్‌
అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.. తెలుగు మూవీపై జాన్వీ ప్రశంసలు
అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.. తెలుగు మూవీపై జాన్వీ ప్రశంసలు
ఉదయం లేదా సాయంత్రం.. గ్రీన్‌టీ ఏటైంలో తాగడం ఉత్తమం
ఉదయం లేదా సాయంత్రం.. గ్రీన్‌టీ ఏటైంలో తాగడం ఉత్తమం
ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. ఆ బస్సుల్లో కూడా ఫ్రీ..
ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. ఆ బస్సుల్లో కూడా ఫ్రీ..
మన కల్చర్ ప్రపంచానికి పరిచయం చేయాలి.. అల్లు అరవింద్..
మన కల్చర్ ప్రపంచానికి పరిచయం చేయాలి.. అల్లు అరవింద్..
సమ్మిట్‌లో రెండోరోజు కీలక అంశాలపై లోతైన డిస్కషన్‌
సమ్మిట్‌లో రెండోరోజు కీలక అంశాలపై లోతైన డిస్కషన్‌
డ్రగ్స్ కేసులో నటి హేమకు భారీ ఊరట.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
డ్రగ్స్ కేసులో నటి హేమకు భారీ ఊరట.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
వరుసగా 18 మ్యాచ్‌ల్లో టీమిండియాకు భారంగా సూర్య..
వరుసగా 18 మ్యాచ్‌ల్లో టీమిండియాకు భారంగా సూర్య..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. మూడు రోజుల్లో తీసుకోకపోతే
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. మూడు రోజుల్లో తీసుకోకపోతే
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! సూపర్‌ స్మార్ట్‌ ఫోన్‌
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! సూపర్‌ స్మార్ట్‌ ఫోన్‌