ఆ పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకు వ‌చ్చిన దిల్ రాజు

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు. త‌ల్లిదండ్రులు ఆక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డంతో..అనాథ‌లుగా మారిన ముగ్గురు పిల్ల‌ల క‌థ‌నాలు ఇటీవ‌ల మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఆ పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకు వ‌చ్చిన దిల్ రాజు

Yadadri Orphans : స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు. త‌ల్లిదండ్రులు ఆక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డంతో..అనాథ‌లుగా మారిన ముగ్గురు పిల్ల‌ల క‌థ‌నాలు ఇటీవ‌ల మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకునేందుకు దిల్ రాజు ముందుకొచ్చారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు స‌త్య‌నారాయ‌ణ ఏడాది క్రితం త‌నువు చాలించారు. అత‌ని భార్య అనురాధ కూడా ఇటీవ‌లే క‌న్నుమూశారు.  ఈ క్ర‌మంలో తొమ్మిదేళ్ల ఆ దంప‌తుల పెద్ద కుమారుడే త‌న తమ్ముడు, చెల్లెళ్ల‌ను జాగ్ర‌త్త‌గా చూసు‌‌కుంటున్నాడు. ఈ క‌థ‌నంపై స్పందిచిన న‌టుడు సోనూ సూద్ కూడా వారికి అండ‌గా తానుంటాన‌ని ముందుకు వ‌చ్చారు. వారు ఇక మీద‌ట‌ అనాథ‌లు కార‌ని, వారి బాధ్య‌త తన‌దే అని ప్ర‌క‌టించారు. వారిని మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌కు తీసుకువ‌చ్చి ఓ ఆశ్ర‌మంలో ఉంచి చ‌దివిస్తాన‌‌ని పేర్కొన్నారు.

అయితే ఆ పిల్ల‌ల క‌థ‌నాన్ని చూసిన‌ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం చ‌లించిపోయారు. ఆ ముగ్గురిని ద‌త్త‌త తీసుకునేందుకు సిద్ద‌మ‌ని చెప్పారు. వారి బాధ్య‌త‌ను ఇక మీద‌ట తానే చూసుకుంటాన‌ని వెల్ల‌డించారు. అయితే ఆ ముగ్గురు పిల్ల‌లు ఈ ఇద్ద‌రిలో ఎవరి ద‌గ్గ‌ర‌కు వెళ్తార‌నేది ఇంకా నిర్ణ‌యించుకోలేదు.

 

Read More : షోలో కన్నీటి పర్యంతమైన సోనూ సూద్

Click on your DTH Provider to Add TV9 Telugu