Devara Movie: ‘దేవర’ ట్రైలర్ ఆలస్యం పై నెటిజన్ పోస్ట్.. టీం రియాక్షన్ ఇదే..

ఈరోజు హైదరాబాద్ నోవాటెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దీంతో తారక్ అభిమానులకు ఈరోజే దేవర నుంచి మరో ట్రైలర్ ఇవ్వాలని భావించారు మేకర్స్. ఈ మేరకు అధికారికంగా పోస్ట్ కూడా పెట్టారు. ఈరోజు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయాలని భావించారు. కానీ ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

Devara Movie: 'దేవర' ట్రైలర్ ఆలస్యం పై నెటిజన్ పోస్ట్.. టీం రియాక్షన్ ఇదే..
Devara
Follow us

|

Updated on: Sep 22, 2024 | 1:45 PM

ఇప్పుడు టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రాల్లో దేవర ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ నోవాటెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దీంతో తారక్ అభిమానులకు ఈరోజే దేవర నుంచి మరో ట్రైలర్ ఇవ్వాలని భావించారు మేకర్స్. ఈ మేరకు అధికారికంగా పోస్ట్ కూడా పెట్టారు. ఈరోజు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయాలని భావించారు. కానీ ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

ఇటీవల ఆయుధ పూజ సాంగ్ కూడా చివరి నిమిషంలో వాయిదా వేయడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అడియన్స్, తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ట్రైలర్ రిలీజ్ వాయిదా పడడంతో మరోసారి చిత్రయూనిట్ పై ఫైర్ అవుతున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్ విడుదల మరింత ఆలస్యమవుతుందని చిత్రయూనిట్.. ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తామని టీమ్ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర ట్రైలర్ వాయిదా పడడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. “ఇలా వాయిదా పడడం లేదా ఆలస్యం కావడం మనకు మొదటిసారి అనుకుంటున్నాను” అంటూ కామెంట్ చేయగా దేవర టీం రియాక్ట్ అయ్యింది. “అదేగా.. చివరకు విడుదల సమయానికి వచ్చేసరికి ఇలాంటి అప్డేట్స్ విషయంలో స్వల్ప ఆలస్యమవుతుంది. కానీ పర్వలేదు. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం”అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం దేవర టీం చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న తారక్.. దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా రాబోతున్నారు. అరవింద సమేత సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న తారక్.. ఇప్పుడు దేవర మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమా ఇదే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.