ఐఫోన్‌తో తీసిన ఫహద్‌ ఫాజిల్ సినిమా, రిలీజ్ డేట్ ఫిక్స్

క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యాన్ని సినిమావాళ్లు బాగా వినియోగించుకున్నారు. టెక్నిక‌ల్ శాఖ‌ల వారు క్రియేటివిటీకి ప‌దునుపెట్టేలా పుస్త‌కాలు చ‌దువుతూ, ర‌క‌ర‌కాల సినిమాలు చూస్తూ గ‌డిపేశారు.

ఐఫోన్‌తో తీసిన ఫహద్‌ ఫాజిల్ సినిమా, రిలీజ్ డేట్ ఫిక్స్
Ram Naramaneni

|

Aug 27, 2020 | 2:30 PM

క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యాన్ని సినిమావాళ్లు బాగా వినియోగించుకున్నారు. టెక్నిక‌ల్ శాఖ‌ల వారు క్రియేటివిటీకి ప‌దునుపెట్టేలా పుస్త‌కాలు చ‌దువుతూ, ర‌క‌ర‌కాల సినిమాలు చూస్తూ గ‌డిపేశారు. ఇక న‌టీన‌టులు త‌మ మాన‌సిక‌, శారీర‌క అంశాల‌పై ఫోక‌స్ పెట్టారు. జిమ్‌కి వెళ్తూ, యోగా, ప్రాణామాయాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ఇక వ‌ర్మ లాంటి వాళ్లు ఆ గ్యాప్ కూడా వ‌ద‌ల‌కుండా సినిమా షూటింగులు చేసేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్ చేరిపోయాడు. ఆయ‌న లాక్‌డౌన్ స‌మ‌యంలో‌ ఓ క్రైమ్‌ థ్రిల్లర్ మూవీలో న‌టించారు. అది కూడా ఐఫోన్‌తో తీయడం చెప్పుకోద‌గ్గ అంశం. 90 నిమిషాల నిడివితో రాబోత‌న్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను 20 రోజుల్లో కంప్లీట్ చేశారు.

‘సీ యూ సూన్ పేరుతో రూపొందించిన ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, రోషన్‌ మాథ్యూ, దర్శన రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. మహేశ్‌ నారాయణ్ డైరెక్ట్ చేశారు. తప్పిపోయిన కుమార్తెను క‌నుగునేందుకు ఓ తండ్రి ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న కథ నేపథ్యంతో ఈ క‌థ‌లో కొంత భాగం ఉంటుంది.  మరోవైపు దుబాయ్‌లో ఉండే తన బంధువైన యువకుడి భార్య మిస్స‌వుతుంది. కేవలం ఓ సూసైడ్‌ వీడియో మాత్రమే ఆధారంగా లభిస్తుంది. అప్పుడు కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దాన్ని ఎలా ఛేదించడన్న కోణం కూడా చూపించ‌నున్నారు. ప్టెంబరు 1న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Also Read :

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu