CPI Narayana: చిరు ఫ్యాన్స్ ఆగ్రహం.. వెనక్కి తగ్గిన నారాయణ.. మెగాస్టార్‌కు సారీ..

చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన CPI నారాయణ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివాదం ఇక్కడితో ముగించాలని మెగా ఫ్యాన్స్‌ను కోరారు.

CPI Narayana: చిరు ఫ్యాన్స్ ఆగ్రహం.. వెనక్కి తగ్గిన నారాయణ.. మెగాస్టార్‌కు సారీ..
Cpi Narayana Chiru
Follow us

|

Updated on: Jul 20, 2022 | 1:31 PM

Andhra Pradesh: ఎట్టకేలకు సీపీఐ నారాయణ వెనక్కి తగ్గారు. మెగాస్టార్ చిరంజీవి(Chirnajeevi)కి సారీ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని..  వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తాను వాడిన పదాన్ని భాషా దోషంగా పరిగణిస్తున్నానని.. వివాదం వద్దని సూచించారు. చిరంజీవి రాజకీయ నేతగా ఉన్నారని..రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. మెగా అభిమానులు ఈ వ్యాఖ్యల్ని మర్చిపోవాలని కోరారు.  చిరంజీవి ఫ్యాన్స్, కాపు నాడు సభ్యులు కలిసి వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఇటీవల చిరంజీవి, పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) టార్గెట్‌గా  కాస్త ఘాటు పదజాలం ఉపయోగించారు నారాయణ. ప్రధాని మోదీ హాజరైన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదిక పైకి.. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలవకుండా.. చిరును పిలవడాన్ని తప్ప పట్టారు. రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవికి స్టేజ్‌పై ప్లేస్ తగదని.. చిల్లర బేరగాడు అంటూ కామెంట్స్ పేల్చారు. అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్  లాంటివాడని.. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు.

కాగా నారాయణ చిరును టార్గెట్ చేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆయనకు పలు వార్నింగ్స్ వచ్చాయి. కాపు సంఘాలు కూడా నారాయణ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలీస్ కంప్లైంట్స్ వరకు వెళ్లింది వ్యవహారం. మెగా బ్రదర్ నాగబాబు కూడా రెస్పాండ్ అయ్యారు. నారాయణకు గడ్డి తినడం మాన్పించి.. అన్నం తినడం నేర్పాలని తన మార్క్ కామెంట్స్ చేశారు. నారయణ లైన్ క్రాస్ చేశారని పలువురు నిపుణులు నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో వెనక్కి తగ్గి.. తన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు నారాయణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.